రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు కాస్త వెయిట్ ఎక్కువ. ఇక మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పై ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న సంక్షోభంపై, గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.
Also Read : బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా దేవినేని వారసుడు..?
కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అంటూ.. గతంలో కేసీఆర్ చేసిన రాజకీయమే ఇప్పుడు వారిని వెంటాడుతోంది అంటూ రేవంత్ ఓ కామెంట్ చేశారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉండకూడదని, ఎమ్మెల్యేలు కావాలంటే నే భయపడే విధంగా అప్పట్లో కెసిఆర్ రాజకీయం చేసినట్లు రేవంత్ వ్యాఖ్యానించారు. కాబట్టే కర్మ సిద్ధాంతం కేసీఆర్ కుటుంబాన్ని వదలటం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను కూడా రేవంత్ ప్రస్తావించారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తు చేసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసింది స్వల్పంగా గుర్తు చేశారు.
Also Read : తగ్గిన జీఎస్టీ.. ఏయే ధరలు తగ్గుతాయంటే..!
ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కెసిఆర్ పాలనలో ప్రతిపక్షాలకు సౌకర్యంతమైన పరిస్థితి ఉండేది కాదు అనే మాట వాస్తవం. కాంగ్రెస్, టిడిపి ల నుంచి గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ 2014 తర్వాత తన పార్టీలోకి తీసుకున్నారు. వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా గెలవని వారిని కూడా తీసుకుని వారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన పరిస్థితి కూడా ఉంది. తనపై పోరాడిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా, ఇతర రాజకీయపక్షాల గొంతు అసెంబ్లీలో లేకుండా చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారు.
Also Read : ఏపీ స్థానిక సమరానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధం..!
అయితే ఇప్పుడు పరిస్థితి వికటించి అధికారం కోల్పోవడమే కాకుండా, కుటుంబంలో ఏర్పడిన సంక్షోభం కేసిఆర్ కు చుక్కలు చూపిస్తోంది. ఎన్నో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దిన ఆయన కవితను మాత్రం చల్లబరచలేకపోయారు. ఏకంగా హరీష్ రావు పైనే కవిత గురిపెట్టి విమర్శలు చేయడం గులాబీ పార్టీనీ మరింత ఇబ్బంది పెడుతోంది. దీనితో కవితను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె బాటలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పయనించే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం గులాబీ పార్టీని కలవరపెట్టే అంశం. ఇలా ఒకప్పుడు ప్రతిపక్షాలను వేధించిన కేసీఆర్ ఇప్పుడు తల పార్టీలో తన కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులతో ఊహించని ఇబ్బందులు పడుతున్నారు.