ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్… అదే అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగిందనేది వాస్తవం. అది ఎంతలా అంటే.. అల్లు అర్జున్ అరెస్ట్ వార్తను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా చూపించింది. ఇదే అంశంపై డిబేట్లు కూడా నిర్వహించింది. ఇక అరెస్ట్ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకునే వరకు తెలుగు మీడియాలో మరో వార్త లేదు. ఇదే విషయాన్ని పొలిటికల్‌గా లింక్ చేస్తూ డిబేట్లు కూడా పెట్టారు. బన్నీ అరెస్టు వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ నేతలు.. అసలు బన్నీ అరెస్టుతో మాకేంటి సంబంధం అంటూ టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేసుకున్నారు కూడా. అరెస్టు విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తనకు విషయం తెలిసిన వెంటనే అల్లు అరవింద్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
Also Read : విడుదలైన పుష్ప… ఇంటి వద్ద ఎమోషన్ సీన్స్
అయినా సరే అరెస్టు వెనుక టీడీపీ కుట్ర ఉందనేది వైసీపీ నేతల ఆరోపణ. ఇదే విషయాన్నితమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు వైసీపీ నేతలు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విచిత్రమైన డిమాండ్లు చేశారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తే… గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు చంద్రబాబును బాధ్యుడిని చేయాలని లక్ష్మీ పార్వతి వింత వాదన తెరపైకి తెచ్చారు. అలాగే ఈ అరెస్టు వెనుక టీడీపీ, జనసేన నేతల కుట్ర ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. అదే సమయంలో బన్నీని పవన్ కల్యాణ్ ఎందుకు పరామర్శించలేదని కూడా ప్రశ్నించారు.
Also Read : అమ్మో పవన్ అంటున్న అధికారులు.. తర్వాతి గురి ఎవరిపై..?
వైసీపీ నేతల ఆరోపణలన్నీ ఫేక్ అని తేలిపోయింది. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలియగానే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లు అరవింద్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే కాబోయే మంత్రి నాగబాబు కూడా బన్నీ ఇంటికి వెళ్లారు. పవన్ కూడా నిరంతరం మానిటరింగ్ చేశారు. ఇక బన్నీ అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల వరకు అల్లు అరవింద్‌తోనే ఉన్నారు. చివరికి బన్నీ విడుదలై ఇంటికి చేరుకున్న తర్వాత కూడా గంటా ఇంట్లోనే ఉన్నారు. దీంతో టీడీపీకి బన్నీకి మధ్య విబేధాలున్నాయంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.