Friday, September 12, 2025 11:19 PM
Friday, September 12, 2025 11:19 PM
roots

చిరంజీవి కి రాజ్యసభ ఆఫర్.. ఢిల్లీలో డీల్ ఫైనల్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏపీలో బిజెపిని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా కాపు ఓటు బ్యాంకు పై దృష్టి పెడుతున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకురావడానికి బిజెపి పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నయి.

Also Read : రైతు భరోసా మోసాలకు చెక్.. రేవంత్ కీలక అడుగులు…!

2024లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రధాని మోడీ లాంగ్వేజ్ చూసిన వాళ్లందరూ కూడా ఖచ్చితంగా చిరంజీవిని మోడీ… బిజెపి లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో వైయిట్ పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం.. ఆయన ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాల్లో బిజెపి విజయం సాధించడం వంటివి బిజెపి పెద్దలను ఆకట్టుకున్నాయి.

Also Read : వైసీపీలో మార్పులు.. మరి సీనియర్ల పరిస్థితి ఏమిటో..?

దీనితో… పవన్ కళ్యాణ్ కూడా తన అన్నను మళ్ళీ రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరగగా ఈ వేడుకలకు ప్రధాని మోడీతో పాటుగా చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీళ్ళిద్దరూ చర్చలు జరిపినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. 2009లో పార్టీ పెట్టి ఓటమి చవిచూసిన చిరంజీవి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి అయ్యారు.

Also Read : ఏపీకి అమిత్ షా.. పక్కా పొలిటికల్ టూర్…?

ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకువచ్చి ఆయన సేవలను వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలలో అందరిలో ఒకడిలా కాకుండా చిరుకు ప్రత్యేక గౌరవం దక్కింది. చిరంజీవి ఎక్కువగా మోడీ వెంటే కనిపించారు. అటు కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా చిరంజీవికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. దీనితో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లి రాజ్యసభలో అడుగుపెట్టి అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్