Monday, October 20, 2025 11:07 AM
Monday, October 20, 2025 11:07 AM
roots

జగన్ పై లేని కోపం బాలయ్యపై ఎందుకో..? అప్పుడు మెగా ఫ్యాన్స్ పౌరుషం ఏమైంది..?

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సీన్స్ బలే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయి. వాటి నుంచి పుట్టే క్వశ్చన్స్ కూడా బావుంటాయి. ఆ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ కూడా కొందరి ఆలోచనా విధానాన్ని స్పష్టంగా అర్ధమయ్యేలా చెప్పేస్తాయి. అసలు ఏంటి ఆ సీన్స్.. ఆ క్వశ్చన్స్ ఏంటీ..? ఆ ఆన్సర్స్ ఏంటీ..? ఆ ఆలోచనా విధానం ఏంటీ..? ఒక్కసారి చిన్న రౌండప్ వేద్దాం. తాజాగా ఏపీ అసెంబ్లీలో.. మెగాస్టార్ చిరంజీవిని, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏదో అన్నారని ఓ హడావుడి ఓ రేంజ్ లో జరిగింది. దానికి వైసీపీ అనుకూల మీడియా మంచి వెయిట్ ఇచ్చి హైప్ క్రియేట్ చేసింది.

Also Read : జగనన్నా.. మాకు కూడా న్యాయం చేయండి..!

ఇక సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్.. ఆ తర్వాత టీడీపీ వర్సెస్ జనసేన వార్స్ జరిగాయి. ఈ సీన్ కు సింపుల్ గా తెర పడింది గానీ.. ఇక్కడ మెగా ఫ్యాన్స్ చేసిన హడావుడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది. బాలకృష్ణపై కేసులు పెట్టాలని హైదరాబాద్ లో ఓ మీటింగ్ నిర్వహించారు. తమ హీరోను అవమానించారు కాబట్టి కేసు పెడతామని.. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కు వెళ్దాం.. అప్పట్లో అమ్మ ఒడి పథకం ప్రారంభించే కార్యక్రమంలో విజయవాడలో జగన్.. అమ్మఒడి కార్యక్రమ లబ్ది దారుల గురించి మాట్లాడారు.

ఆ మాటల్లో జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. భార్యలు, పిల్లల గురించి ముఖ్యమంత్రి హోదా మరిచి కామెంట్ చేసారు. ఆ తర్వాత కూడా బోరుగడ్డ అనీల్ లాంటి వాళ్ళు ఎందరో.. అత్యంత జుగుప్సాకరంగా పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడారు. అయినప్పటికీ.. అప్పట్లో ఎవరి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదు..? కేసులు ఎందుకు పెట్టలేదు..? రహస్య సమావేశాలు ఎందుకు నిర్వహించలేదు.. ఇలా అడుగుతూపోతే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి.

Also Read : బాబోయ్.. 130 కోట్ల అప్పులు..!

కారణం జగన్ అంటే భయం అంటారు సినిమా అర్ధమైన వాళ్ళు.. ఇంకొంత మంది అభిప్రాయం ప్రకారం.. కోపం వచ్చినా ప్రేమ కలిగినా.. కులంపై ఉండే ఆగ్రహం వాళ్ళను కంట్రోల్ చేసింది అంటారు. ఈ రెండు సమాధానాలు కరెక్టే అనేది మరికొందరు. జగన్, ఆయన పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎంతో అసభ్యంగా మాట్లాడినా సరే పౌరుషంగా ఎప్పుడూ ఫ్యాన్స్ సమావేశాలు నిర్వహించలేదు. ఇక నందమూరి ఫ్యామిలీ విషయంలో ఫ్యాన్స్ చేస్తున్న అత్యుత్సాహం కూడా ఆశ్చర్యపరుస్తోంది. జగన్ అంత అవమానించినా బయటకు రాని, రాలేని ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా వస్తున్నారు అంటూ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మెగా ఫ్యామిలీపై ప్రేమ కంటే ఓ కులంపైనే వారి అభిమానులకు కోపం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్