జమ్మూ కాశ్మీర్ ను మిగిలిన భారతదేశంలో కలుపుతూ నిర్మించిన రైలు బ్రిడ్జి జూన్ 4 నుంచి వాడుకలోకి వచ్చింది. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దీనిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించగా పలు కారణాలతో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. వాతావరణ కారణాలతో పాటుగా భౌగోళిక కారణాలు కూడా చినాబ్ నదిపై నిర్మించే వంతెనకు అడ్డంకులుగా మారాయి. ఈ నిర్మాణం పూర్తి చేయడానికి పివి నరసింహారావు ప్రభుత్వంతోపాటుగా తర్వాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కూడా తీవ్రంగా కష్టపడ్డాయి.
Also read : సచివాలయానికి దూరంగా మంత్రులు..? బాబు వార్నింగ్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన గా పేరు ఉన్న ఈ వంతెన నిర్మాణానికి ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఉగ్రవాదుల ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. 2008లో పటిష్టత కారణంగా వాయిదా పడిన ఈ నిర్మాణం.. 2010లో మళ్ళీ పున ప్రారంభమైంది. ఇక అక్కడినుంచి 2015కు నిర్మాణం పూర్తి చేయాలని భావించినా సాధ్యం కాలేదు. 2015 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా ముందుకు వెళ్లడంతో పనులు వేగంగా జరిగాయి. ఇక ఈ నిర్మాణం పూర్తి కావడంలో తెలుగు ఇంజనీర్ పాత్ర మరువలేనిది.
Also read : ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ మాస్ సర్ప్రైజ్
బెంగళూరులో ప్రొఫెసర్ గా పని చేస్తున్న గాలి మాధవి లతకు 2010లో ఈ వంతెనకు జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నియమించింది. ఇక అక్కడి నుంచి 17 ఏళ్ల పాటు నిర్విరామంగా ఆమె ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తూ వచ్చారు. కుటుంబానికి కూడా దూరంగా ఓ మహిళ ఏళ్ల తరబడి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పనిచేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. గాలి మాధవి లత కృషిని జాతీయస్థాయిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు అభినందిస్తున్నారు. ఓ తెలుగు మహిళ ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నిర్మాణంలో కీలక బాధ్యతలు పోషించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.




