ఏపీలో పాఠశాలలకు దసరా సెలవుల్లో మార్పు చేసింది కూటమి ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ. ఈ నెల 22వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ముందుగా ఏపీ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 8 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
Also Read : అప్పుడు చెంప దెబ్బ.. ఇప్పుడు స్వామి సేవ..!
సాధారణంగా ప్రతి ఏడాది దసరా నవరాత్రుల మొదటి రోజు నుంచే ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం చిన్నపాటి మార్పులు చేసింది. నవరాత్రులు మొదలైన రెండు రోజుల తర్వాత మూడో రోజు నుంచి సెలవులిస్తున్నట్లు ముందుగా ప్రకటించింది. ముందుగా ఈ నెల 25వ తేదీ నుంచి సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా.
Also Read : జగన్‌కు షాక్.. టీడీపీలోకి ముఖ్య నేత..!
సెలవులు 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. తాజాగా టీడీపీ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలు అంతా కలిసి మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై అధికారులతో చర్చించిన తర్వాత పాఠశాలలకు దసరా సెలవుల్లో మార్పు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. “పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం.” అని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అన్ని పాఠశాలలకు రేపే చివరి వర్కింగ్ డే కానుంది.