Saturday, August 30, 2025 07:39 AM
Saturday, August 30, 2025 07:39 AM
roots

ఏపీలో కొత్త జిల్లా.. అమరావతిపై చంద్రబాబు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్తగా అడుగులు వేస్తోంది. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అమరావతి పనుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రస్తుతం అమరావతిలో పనులు వర్షాల కారణంగా కాస్త వాయిదా పడినా.. ఆ తర్వాత మాత్రం దూకుడుగా జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అన్న నేపథ్యంలో అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణంతో పాటుగా పలు కీలక అంశాల్లో వేగంగా అడుగులు పడుతున్నాయి.

Also Read : మహిళ దెబ్బకు షాక్ అయిన సుప్రీం ఛీఫ్ జస్టిస్

తాజాగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ఓ వార్త వెలువడింది. అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్విభజన పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రాథమికంగా సమాచారం సేకరించి అధ్యయనం చేసేందుకుగాను ఏడుగురు మంత్రులు అలాగే ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

Also Read : వీసా లేకుండా భారతీయులు ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చంటే..?

అమరావతి జిల్లాగా ప్రకటించేందుకు త్వరలోనే అడుగులు పడవచ్చు అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజధాని అమరావతి గా ఉన్నా సరే కొన్ని కార్యకలాపాలు ఇప్పటికి కూడా విజయవాడ నుంచి జరుగుతున్నాయి. మరి కొన్ని కార్యకలాపాలను గుంటూరు నుంచి నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతం మొత్తం గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. సచివాలయం వెలగపూడి లో ఉన్నా సరే క్షేత్రస్థాయిలో పాలనాపరమైన నిర్ణయాలు అన్ని గుంటూరు నుంచి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వీఐపీల పర్యటనలు, శాంతి భద్రతల పర్యవేక్షణ అన్ని గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. రాజధానికి ప్రత్యేక జిల్లా కేంద్రం లేకపోవడంతో గుంటూరు కీలకంగా మారింది. దీనితో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, నియోజకవర్గాలతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలను కలిపి అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్