ఏపీ అసెంబ్లీలో సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం లో శాంతి భద్రతలు ఎంతో కీలకమని స్పష్టం చేసారు. వీటికి ఎవరు విఘాతం కలిగించినా సరే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో గంజాయి.. డ్రగ్ విచ్చలవిడిగా విక్రయించారన్న సిఎం.. ఈ వ్యవహారాలపై ప్రశ్నిస్తే అప్పట్లో వైసిపి నేతలు పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని, పవిత్ర ఆలయాలుగా భావించే పార్టీ ఆఫీసులపై దాడులు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపామన్నారు.
Also Read : ప్రపంచ కప్ ఆడతాడా…? రోహిత్ పై ఎన్నో సందేహాలు…!
రాష్ట్రంలో ఒక్క ఎకరా లో కూడా గంజాయి పండకుండా చూడాలన్నారు. టెక్నాలజీ ద్వారా గంజాయి డ్రగ్స్ అరికడుతున్నామన్నారు. ఈగల్ టీం నూ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయి పండించే వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు చేసే రౌడిలను… ఆకతాయిలు లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అని హెచ్చరించారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అమలులోకి తెస్తున్నామన్నారు. భూ కబ్జాలకు పాల్పడే వారికి చివరి వార్నింగ్ ఇస్తున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
Also Read : బోరుగడ్డ వస్తాడా…? పోలీసుల్లో పెరుగుతోన్న ఉత్కంట
వివేక హత్య కేసులో నాపై నిందలు వేశారని హత్య రాజకీయాలు లేకుండా 40 ఏళ్లు రాజకీయం చేశానన్నారు. ఎమ్మెల్యే లు అందరు నియోజవర్గం లో లా అండ్ ఆర్డర్ తప్పకుండా కంట్రోల్ కి తీసుకొనిరావాలని సూచించారు. పోలీసులకు కనీసం పెట్రోల్ ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారని.. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దాచేపల్లి లో ముస్లిం అమ్మాయీ పై ఆత్యాచారం కేసులో 18 టాస్క్ ఫోర్స్ టీం లను లను ఏర్పాటు చేశాం దాంతో నిందితుడే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని.. గంజాయి.. డ్రగ్స్ దొరికితే వారి పని అయిపోయినట్లే అని హెచ్చరించారు.