Tuesday, October 28, 2025 01:45 AM
Tuesday, October 28, 2025 01:45 AM
roots

గెలిపించుకుని రండి.. మంత్రులకు చంద్రబాబు టార్గెట్

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి చాలా సీరియస్ గా తీసుకుంది. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అలాగే ఉభయగోదావరి జిల్లాల తో పాటుగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను రాష్ట్ర అధికార కూటమి సీరియస్ గా తీసుకుని అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు ఉన్నా సరే ఎమ్మెల్యేలు మంత్రులు వాటిపై దృష్టి పెట్టాలని.. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని కూటమి పార్టీల అధినేతలు ఇప్పటికే ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.

Also Read : సరికొత్త నిబంధనలతో.. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లపై గట్టి ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అక్కడ పాకలపాటి రఘువర్మకు మద్దిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మూడు జిల్లాలు ఇన్చార్జి మంత్రులు.. ఇటు అసెంబ్లీ సమావేశాలతో పాటుగా అటు ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ముందుకు నడిపించనున్నారు. ఇక ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఇదే పట్టుదల కనిపిస్తోంది. ఎలాగైనా సరే ఈ స్థానాన్ని గెలిచి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో.. ఏవైనా బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో ఇబ్బందులు పెట్టే దిశగా అడుగులు పడుతుండటంతో కాస్త జాగ్రత్త పడుతుంది కూటమి.

Also Read : ప్రతి విషయానికీ ఆయనేనా… ఇలా అయితే కష్టమే..!

ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. ఇక త్వరలోనే ఒకరిద్దరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక కృష్ణ, గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో ఆలపాటి రాజా గెలవడం ఖాయంగా కనపడుతోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఆయన ప్రచారం గట్టిగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి పూర్తి సహకారం కనపడుతోంది. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటికే మంత్రులు అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టారు. ఇక ఏవైనా అసంతృప్తులు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం జరుగుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్