Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్.. బాబు వ్యూహం అదుర్స్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి మరో ఊహించని దెబ్బ తగిలింది. తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే తమ ఎమ్మెల్సీ పదవులకు సైతం వారు రాజీనామాలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయంగా ఇప్పుడు ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. శాసన మండలి ద్వారా ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెట్టాలని వైఎస్ జగన్ భావించినా.. అది సాధ్యమయ్యే విధంగా కనపడటం లేదు. మూడు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పడం, ఏకంగా ఎమ్మెల్సీ పదవులకే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ విషయంలో కూటమి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టని వారిని మాత్రమే పార్టీలోకి తీసుకునే క్రమంలో వచ్చే వాళ్ళు రాజీనామా చేయాల్సిందే అనే కండీషన్ పెడుతున్నారు. ఇక ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల మీదనే టీడీపీ గురి పెట్టింది అని సమాచారం.

జగన్ వద్ద ఉన్న ఎమ్మెల్సీలతో రాబోయ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టె బిల్లులను అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఆ వ్యూహానికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీల మద్దతు టిడిపి కి కావాలి. వైసీపీ ని నిర్వీర్యం చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు, బిల్లులు ఆమోదం కావాలంటే మండలిలో ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకోక తప్పదు. దీంతో రాజీనామా చేసి వచ్చే ఎమ్మెల్సీలను తీసుకోవడం తప్పనిసరి అని తెలుస్తుంది.

ఇక వైసీపీ నుంచి వచ్చిన వారిని డైరెక్ట్ గా తీసుకుంటే విమర్శలకు వేదిక అయ్యే అవకాశం ఉంది. అందుకే వారితో రాజీనామాలు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఢిల్లీలో ఏ పార్టీకి అయినా వైసీపీ దగ్గర కావాలంటే వారి వద్ద ఉన్న రాజ్యసభ పదవులు కీలకం. అందుకే ఇప్పుడు రాజ్యసభ ఎంపీలను సైతం కూటమి లాగే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్సీల విషయంలో అనుసరించిన వ్యూహాన్నే రాజ్యసభ ఎంపీల విషయంలో కూడా అనుసరించాలని కూటమి భావించి సక్సెస్ అవుతోంది అనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్