టీడీపీ వివాదాస్పద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. గత కొన్నాళ్ళుగా వివాదాలతో సావాసం చేస్తున్న కొలికపూడికి పార్టీ అధిష్టానం ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు పంపింది. అయినా సరే ఎమ్మెల్యే తీరులో మాత్రం మార్పు రావడం లేదు. పార్టీ కార్యకర్తలు ఆయన తీరుపై ముందు నుంచి అసహనంగానే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యే గారి గురించి పెద్ద రచ్చ జరుగుతూనే ఉంది. ఆయన ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.
Also Read : పోలవరం కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ ప్రత్యేకతలు ఇవే…!
రాజకీయంగా అవకాశం లభించిన సమయంలో కొలికపూడి.. దూకుడు స్వభావంతో పదే పదే పార్టీ పెద్దలకు సమస్యలు తీసుకు రావడం అధినేత చంద్రబాబుకు చికాకుగా మారింది. మీడియా ప్రతినిధుల విషయంలో కూడా ఎమ్మెల్యే ఇలాగే వ్యవహరించడంతో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇక తాజాగా ఆయనపై చర్యలకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం పై టిడిపి హై కమాండ్ సీరియస్ అయింది. సోమవారం టిడిపి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు అవ్వాలని కొలికపూడికి ఆదేశాలు పంపారు.
Also Read : ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏలూరి ముద్ర
జనవరి 11వ తేదీన ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టి మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న టిడిపి హై కమాండ్.. ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని ఆదేశించింది. తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణ ను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళనుంది క్రమశిక్షణ కమిటీ బృందం. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపుడిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.