ఏపీ కేబినేట్ సమావేశం అనంతర పరిణామాలు వాడీ వేడీగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రుల పని తీరుపై ఆరా తీసారు. అలాగే మంత్రులకు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదే అని సీఎం స్పష్టంగా చెప్పారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
Also Read : ఉద్యోగాల జాతర.. ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు
రైతులకు, మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.20,000ను ఒకేసారి చెల్లించే అంశంపై కూడా కేబినేట్ లో చర్చ జరిగింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం. అలాగే ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు.
Also Read : షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్..!
ఇక మంత్రుల పని తీరుపై చంద్రబాబు ప్రోగ్రెస్ అడిగారు. 6 నెలలుగా శాఖల వారీగా కొందరు మంత్రులు రిపోర్ట్ ఇవ్వలేదు. గతంలో జరిగిన కేబినేట్ సమావేశాల్లో కూడా ఈ మేరకు మంత్రులను రిపోర్ట్ అడిగారు. అయినా సరే ఇవ్వకపోవడంతో సీఎం సీరియస్ అయ్యారు. ఎన్ని సార్లు అడిగిన్చుకుంటారు అని నిలదీశారు. వెంటనే శాఖలవారీగా ఇవ్వాలని మంత్రులకు చెప్పిన సీఎం.. ఇలాంటి విషయాల్లో అలసత్వం ప్రదర్శించడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. అలాగే మంత్రులు క్షేత్ర స్థాయి పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారని హెచ్చరించారు.