Wednesday, October 22, 2025 02:04 AM
Wednesday, October 22, 2025 02:04 AM
roots

లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలనం..!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా అడుగు పెట్టిన నేపధ్యంలో ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రాజకీయంగా కూడా వైసీపీని ఈ అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. కీలక వ్యక్తుల విచారణకు ఈడీ కూడా ఆసక్తి చూపిస్తున్న తరుణంలో.. ఎవరికి నోటీసులు ముందు ఇస్తారా అనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ తరుణంలో ఓ వార్త పోలీసు వర్గాలను, రాజకీయ వర్గాలను ఊపేస్తోంది.

Also Read : లిక్కర్ స్కామ్ ని మించిన మరో కుంభకోణం బయటపెట్టిన ఏబివి

ఈ లిక్కర్ కేసును ఏపీ సర్కార్ సిబిఐ కి అప్పగించే అవకాశం ఉందని ఓ వార్త బయటకు వచ్చింది. సిఎం చంద్రబాబు నాయుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున దీనిపై అధికారికంగా ప్రకటన చేయవచ్చు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. సిట్ విచారణకు, కొందరు సహకరించడం లేదని ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అలాగే విదేశాల్లో కొందరు నిందితులు ఉన్నారు. వారిని తీసుకు రావడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది.

Also Read : అప్పులకుప్పగా మోడీ జమానా.. కాగ్ రిపోర్ట్ సంచలనం

సిట్ అధికారులకు వారిని తీసుకు రావాలంటే సిబిఐ సహకారం తప్పనిసరిగా మారింది. కాబట్టి ఈ కేసులో సిబిఐ ఎంటర్ వైసీపీ ఇబ్బంది పడే అవకాశాలు సైతం ఉంటాయి. ఇప్పటికే ఈడీ, సిబిఐ కేసులతో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అటు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా వైసీపీకి సమస్యగా మారింది. ఈ తరుణంలో లిక్కర్ కేసు కూడా సిబిఐకి ఏపీ సర్కార్ అప్పగిస్తే మాత్రం పరిణామాల్లో కాస్త మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఈ అంశాన్ని కీలక మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్