బనకచర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం హాట్ హాట్ గా నడుస్తోంది. దీనిపై తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99పైసలకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది.
Also Read : ఇరాన్ కు భయపడ్డ అమెరికా.. అందుకే సీజ్ ఫైర్..?
49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.882.47 కోట్లతో జీఏడీ టవర్, రూ.1487.11 కోట్లతో హెచ్‌ఓడీ కార్యాలయాలను నిర్మించనున్నారు. రూ.1303.85కోట్లతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది కేబినేట్. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Also Read : బోనాల బోనాంజ.. బీ అలర్ట్..!
అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చించింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తిచేయాలని సిఎం సూచించారు. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని స్పష్టం చేసారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని.. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలని స్పష్టం చేసారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు.