ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళిన సిఎం.. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. ‘పూర్వోదయ పథకం’ కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సిఎం వినతీ పత్రం అందించారు. తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి పూర్వోదయ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
Also Read : బాబోయ్.. 130 కోట్ల అప్పులు..!
పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు సిఎం.. నిర్మలా సీతారామన్ కు వివరించారు. రాయలసీమలో హార్టీకల్చర్ ప్రోత్సాహానికి ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు వివరించారు. ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటల ప్రోత్సాహానికి ప్రణాళికలు రూపొందించామని కేంద్ర మంత్రికి వివరించారు. కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
Also Read : కూటమికి నచ్చేసిన పేర్ని నానీ.. ఒక్క కామెంట్ తో ఫిదా..!
ఈ రంగాల్లో పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని కోరారు చంద్రబాబు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఇక ఇదిలా ఉంచితే, సిఎం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గం దత్తిలో పర్యటిస్తారు. అక్కడి నుంచి కార్యకర్తలతో సమావేశమై.. అనంతరం అమరావతి చేరుకోనున్నారు.