ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో… ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించడానికి కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులతోపాటుగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే.. గ్రామాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించారు.
Also Read : వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ రాంరాం
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రోడ్ల నిర్మాణం పై పెద్దగా దృష్టి సారించలేదు రాష్ట్ర ప్రభుత్వం. దీనితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలకు సైతం రోడ్ల నిర్మాణం వంటివి పూర్తవుతున్నాయి. ఇక అమరావతి పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే వీటిని ప్రచారం చేసుకునే విషయంలో దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేల వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
Also Read : సురేష్ బాబు సంచలన నిర్ణయం.. త్వరలో చంద్రబాబు వద్దకు
అమరావతి పనులు తిరిగి ప్రారంభమైన సరే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకువచ్చే విషయంలో కూడా ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. సూపర్ సిక్స్ పథకాల విషయంలో వైసీపీ విమర్శలు చేస్తున్న సరే వాటిపై ఎంఎల్ఏ లు కౌంటర్లు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కక్ష సాధింపులపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారనే ఆరోపణలు వినిపించాయి. దీనితో ప్రతి ఎమ్మెల్యేకు సంబంధించిన నివేదికను ఎప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు.. చుక్కలు చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.