Friday, September 12, 2025 08:50 PM
Friday, September 12, 2025 08:50 PM
roots

చంద్రబాబులో ఈ కోణం వైసీపీ ఊహించలేదా

రాజకీయాల్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అంచనా వేయడం అనేది అసలు సాధ్యం కాదు. అవును ఎవరు ఎన్ని అన్నా సరే ఇది అక్షరాలా నిజం. రాజకీయం అంటే పగలు ప్రతీకారాలు మాత్రమే ఉన్న నేటి రోజుల్లో చంద్రబాబు చేస్తున్న రాజకీయం మాత్రం ఇప్పుడు రాజకీయ విమర్శకుల ప్రశంశలు పొందుతుంది. జాతీయ పార్టీలు అన్నీ కూడా చంద్రబాబుని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. 2019 లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు పని అయిపోయిందనే మాటలు ఎన్నో చూసాం.

పార్టీని కాపాడుకోవడం కష్టం, ప్రత్యర్ధి రాజకీయాన్ని చంద్రబాబు అర్ధం చేసుకుని ముందుకు వెళ్ళడం లేదంటూ ఎవరికి నచ్చిన కామెంట్స్ వారు చేసారు. ఇక పార్టీ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నా, అలాగే చంద్రబాబు మీద లోకేష్ మీద స్వయంగా కేసులు పెడుతున్నా సరే చంద్రబాబు ఎక్కడా కూడా దూకుడుగా రాజకీయం చేసినట్టు కనపడలేదు. కాని పవన్ కళ్యాణ్ తో కలిసి అధికారంలో కూర్చున్నారు చంద్రబాబు. చంద్రబాబుని తిట్టిన వాళ్ళు సైతం ఆయన్ను అర్ధం చేసుకోవడం ఇక్కడే చాలా కష్టమవుతుంది.

కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా జగన్ కు ఇబ్బందులు తప్పవు అని అందరూ భావించారు. కాని ఎక్కడా కూడా చంద్రబాబు తన పాత విధానాన్ని వదిలిపెట్టలేదు. కేసులు పెట్టె విషయంలో అన్నీ చట్ట ప్రకారమే చంద్రబాబు వెళ్తున్నారు గాని మాట కూడా తూలడం లేదు. కవ్విస్తున్నా, మీడియా సమావేశాలు పెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నా కూడా చంద్రబాబు మాత్రం ఎక్కడా తన సహజ స్వభావాన్ని వదలడం లేదు. పదవిలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కూడా ఎక్కడా చంద్రబాబు ఇప్పటి వరకు నోరు జారి మాట్లాడిన సందర్భం లేదు.

పార్టీ నాయకులను కూడా ఆయన హుందాగానే రాజకీయం చేయమని చెప్తున్నారు గాని వదిలేయలేదు. దాడులను ఆపించడం నుంచి వ్యక్తిగత విమర్శలకు అడ్డు కట్ట వేయడం వరకు చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మళ్ళీ తన అభివృద్ధి మంత్రంలోకి వెళ్ళారు. సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన హామీలను కూడా ఆయన ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పి అమలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా చంద్రబాబు తన స్వభావాన్ని వీడకపోవడం ఆ పార్టీ కార్యకర్తలకు నచ్చకపోయినా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేస్తున్న ప్రసంగాలు మాత్రం చాలా హుందాగా ఉంటున్నాయి అనే మాట వాస్తవం అంటున్నారు విమర్శకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్