ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఇటీవల 12 మంది కొత్త కలెక్టర్ లను ప్రభుత్వం నియమించడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సిఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేసారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని స్పష్టం చేసారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి ఉండాలనే నియామకాలు చేపట్టామన్నారు.
Also Read : వైసీపీ నేతలకు ఆ మాత్రం తీరక లేదా..!
ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు.. ప్రభుత్వం విధానాలను సక్రమంగా అమలుచేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసారు. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5 శాతం ఉంది.. తలసరి ఆదాయం రూ.3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నామన్నారు. 2029 నాటికి రూ.29 లక్షల కోట్ల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా యూరియా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
Also Read : సజ్జలను లైట్ తీసుకోండి.. జగన్ సంచలన ఆదేశాలు
యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం కరెక్ట్ కాదన్నారు. దీనికి పంజాబ్‌ను కేసు స్టడీగా తీసుకోవాలని సూచించారు. ఏపీ క్యాన్సర్‌లో టాప్ 5 స్థానంలో ఉందని, ఇలాగే కొనసాగితే క్యాన్సర్‌లో ప్రథమస్థానంలోకి వెళ్తామన్నారు. యూరియాను అవసరం మేరకే వాడాలని సూచించారు. రైతులు వచ్చే ఏడాది నుండి యూరియా తగ్గిస్తే ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని అన్నారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని తెలిపారు. ప్రజలు తినే ఫైన్ వెరైటీలు వేయాలని, లేకపోతే ఎవరూ తినరన్నారు. ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. యూరియా అతివాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.