Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

ఏజెన్సీ వాసుల కోసం బాబు సర్కార్ సూపర్ ప్లాన్…!

అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఐటీడీఏ తరఫున ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఆధునిక సమాజానికి దూరంగానే ఉంటున్నాయి. అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ఏదైనా కష్టం వస్తే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. ప్రధానంగా ఇప్పటికే ఏపీలోని పలు ఏజెన్సీలకు సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చివరికి సరైన వైద్యం అందక మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక డోలీ కష్టాలు అయితే ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాయి.

అయితే ఇలాంటి వాటికి కూటమి సర్కార్ ఓ పరిష్కారం ఆలోచించింది. అదే కంటెయినర్ ఆసుపత్రి. కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సరికొత్త పథకం గిరి వైద్య కేంద్రాలు. వాస్తవానికి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా సులభం. కానీ దానిని నిర్మించాలంటేనే ప్రయాసతో కూడుకున్న పని. కొండ ప్రాంతాలకు ఇటుక, సిమెంట్, ఇసుక, ఇనుము వంటివి తరలించడం కష్టం. పైగా నిర్మాణం వ్యయం కూడా తడిసి మోపెడవుతుంది. ఇలాంటి వాటికి పరిష్కారమే గిరి వైద్య కేంద్రం పేరుతో కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది కూటమి ప్రభుత్వం.

పార్వతీపురం జిల్లాలోని కొండ శిఖర గ్రామాలు సుదూరంగా ఉన్నాయి. అక్కడ అనార్యోగానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డోలి మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి గిరి శిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్‌ ఆస్పత్రిని నెలకొల్పారు. కంటైనర్‌ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు.

Also Read : రెడ్ బుక్ ప్రభావం… వారంతా సర్దేశారు..!

ఈ కంటైనర్‌ ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు చికిత్స అందించడానికి నాలుగు బెడ్లతో కూడిన గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. 15 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ ఆస్పత్రి ద్వారా సాలూరు మండలంలోని పది గ్రామాల గిరిజనులకు సేవలందనున్నాయి. అత్యవసర వైద్య సేవలను ఆసుపత్రిలో అందిస్తారు. దీని ద్వారా డోలీ మోత కష్టాలు తీరాయంటున్నారు స్థానికులు. గిరి ఆరోగ్య కేంద్రం సక్సెస్ కావడంతో… త్వరలో మరిన్ని ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి పలు నిర్మాణ సంస్థలు ఈ కంటైనర్ రూమ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. పాత కంటైనర్‌లను సైట్ ఇంజనీర్లు నివసించేలా, తాత్కాలిక కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు. వీటికే కూటమి సర్కార్ మరిన్ని హంగులు అమర్చి గిరి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో స్కూటర్ అంబులెన్స్‌లను నాటి చంద్రబాబు ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు గిరి ఆరోగ్య కేంద్రాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్