Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

ఇళ్ళు పంచేద్దాం.. టిడ్కో పై బాబు దూకుడు…!

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా గృహ నిర్మాణాల విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ గానే దృష్టి సారిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టిడ్కో నిర్మాణ పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా వదిలేసిన పనులను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో ఇప్పటికే చర్చలు జరిపింది. 2016 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఇళ్లను గత ఐదేళ్ల నుంచి వైసీపీ సర్కార్ పూర్తి చేయకుండా వదిలేసింది.

Also Read : వైసీపీకి వరుస అవకాశాలు ఇస్తున్న టిడిపి..!

లబ్ధిదారులను కూడా ఇబ్బంది పెట్టింది. కొన్ని ఇళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికలకు ముందు కొంతమందికి ఇళ్ల పంపిణీ చేశారు. ఇప్పుడు అసంపూర్తి నిర్మాణాలతో పాటుగా మౌలిక సదుపాయాలు పనులు కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది ఇందుకోసం గాను కాంట్రాక్టర్లకు భరోసా కల్పించే విధంగా 460 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2016 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 3.12 లక్షల గృహాల నిర్మాణం చేపట్టగా వైసిపి వచ్చిన తర్వాత 50వేల గృహాలను రద్దు చేసింది.

Also Read : సంక్రాంతి విన్నర్ బాలయ్యే..!

2.62 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. వాటిలో లక్ష ఇళ్లకు పైగా 50% నుంచి 90% వరకు టిడిపి హయాంలోనే పూర్తయ్యాయి. మిగతా వాటిని పూర్తి చేసేందుకు వైసిపి హయాంలో తీవ్ర జాప్యం జరిగింది అనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో కేవలం 57 వేల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. మరికొన్ని ఇళ్ళ విషయంలో మౌలిక సదుపాయాలు లేకుండానే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీటితో కలిపి ఈ ఏడాది జూన్ నాటికి 2.2 లక్షల గృహాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 4,500 కోట్ల రుణాలను సేకరించినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్