Wednesday, September 10, 2025 01:14 AM
Wednesday, September 10, 2025 01:14 AM
roots

అనుకున్నది.. అనుకున్నట్లుగానే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు దూసుకుపోతోంది. 2024లో అధికారంలోకి వచ్చిన సమయంలో చంద్రబాబు సర్కార్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు కూడా. పీకల్లోతు అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుపై కూడా దృష్టి పెట్టారు.

Also Read : బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ – కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్!

ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం అమరావతి. దీని వల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ముద్ర పడింది. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిన వైసీపీ ప్రభుత్వం.. అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో అమరావతిలో అప్పటికే తుది దశలో ఉన్న కొన్ని నిర్మాణాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేస్తే చాలు.. అందుబాటులోకి వచ్చే భవనాల నిర్మాణం కూడా పూర్తిగా పక్కన పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం.

అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. వాస్తవానికి అమరావతిలో కట్టడాల పరిస్థితులు, వాటి స్థితిగతులపై నివేదికలకే కూటమి ప్రభుత్వానికి ఏడాది పట్టింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో వర్షాల వల్ల అమరావతిలోని ఐకానిక్ భవనాల పునాదుల్లోకి నీరు చేరింది. దీంతో ముంపు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని సమర్థంగా తిప్పికొట్టడంలో ప్రభుత్వం విఫలమైందనేది వాస్తవం. చివరికి టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.

Also Read : ఆ విషయంలో టీడీపీ ఫెయిల్ అయినట్లే..!

దీంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు… అమరావతి పనులపై ప్రతి వారం తనకు అప్ డేట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి నారాయణ ప్రతిరోజు అమరావతి పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం అమరావతిలో పర్యటిస్తున్న నారాయణ.. సాయంత్రం ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేస్తున్నారు. పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఆర్‌డీఏ రీజనల్ కార్యాలయం పనులు పూర్తి కావడంతో.. దసరా పండుగ నాటికి ప్రారంభించనున్నారు.

ఇక నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ – 1, టైప్ – 2 ఇళ్లను పరిశీలించారు నారాయణ. అమరావతిలో గెజిటెడ్, గ్రూప్ – డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్‌లో 1,400 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టైప్-1లో 384 ఇళ్లు, టైప్-2లో 336 ఇళ్లు, గ్రూప్-డి ఉద్యోగుల కోసం 720 ఇళ్లు డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి, ఫిబ్రవరి 1కి అధికారులకు అందజేస్తామన్నారు. మొత్తం 4,400 ఇళ్లలో 3,750 ఇళ్లు వచ్చే మార్చి నాటికి సిద్ధమవుతాయన్నారు. ఐఏఎస్ అధికారుల టవర్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని.. ట్రంక్ రోడ్లు ఏడాదిలో, లేఅవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఐకానిక్ టవర్లను కూడా మూడు ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి అమరావతి అందుబాటులోకి వస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...

ఓజీ కోసం.. చీఫ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా...

దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి...

జగన్‌కు షాక్.. వైసీపీలో...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస...

మాకు ఈ పదవులు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర...

గ్లాస్ స్కై వాక్...

ఏదైనా మంచి జరిగితే.. అది మా...

పోల్స్