ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భేటీ అనగానే కచ్చితంగా ఏదో ఒక సెన్సేషనల్ అప్డేట్ ఉంటుందని జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వీళ్లిద్దరి భేటీ భారతదేశంలో ఐటీ విప్లవానికి నాంది పలకగా.. తాజాగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా మరోసారి బిల్ గేట్స్, చంద్రబాబునాయుడు సమావేశం అయ్యారు. ఈసారి ఐటి, మంత్రి నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు.. బిల్ గేట్స్ ను కలిసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ సెంటర్ ను ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేసారు చంద్రబాబు.
Also Read : దావోస్ లో లోకేష్ స్పీడ్.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్
అలాగే దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్ వేగా నిలపాలని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని బిల్ గేట్స్ ను చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ సలహా మండల్లో భాగస్వామ్యం వహించాలని ఆయనను చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీనితో ఈ వార్త నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి.
Also Read : సరస్వతికి షాక్ ఇచ్చిన సర్కార్.. 25 ఎకరాలు లాగేశారు…!
కచ్చితంగా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయ్యే అవకాశం ఉంటుందని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వ్యవసాయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏవిధంగా వాడుకోవచ్చనేది చూపించడం ఖాయం అంటూ కొంతమంది అనలిస్టులు.. కథనాలు రాస్తున్నారు. ఇక నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని గట్టిగానే ఫోకస్ చేసింది. కొన్ని చానల్స్ లో బిగ్ బ్రేకింగ్ రన్ చేయడం గమనార్హం. గతంలో బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు సమావేశమైన తర్వాత మైక్రోసాఫ్ట్ రావడం.. అక్కడ నుంచి ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపు చూడటంతో దేశంలో ఐటీ విప్లవానికి బీజం పడింది. ఇప్పుడు ఏఐ విప్లవానికి కచ్చితంగా బీజం పడే సంకేతాలు కనపడుతున్నాయని ఐటీ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




