Tuesday, October 28, 2025 06:55 AM
Tuesday, October 28, 2025 06:55 AM
roots

ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటా: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం వరుస సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవలి కాలంలో ఇచ్చిన హామీలపై సిఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించారు. మొదట సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు.. అనంతరం కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించి.. అక్కడి ఎండుచేపలను పరిశీలించి మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి వివరంగా తెలుసుకున్నారు.

Also Read : పవన్ రాకతో విభేదాలు తొలగినట్లేనా..?

ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలుచేస్తామని స్పష్టం చేసారు. రైతులకు 20 వచ్చే నెల నుంచి ఇస్తామన్నారు సిఎం. గత ఐదేళ్లు ఒక్క టీచర్ పోస్ట్ కూడ తీయలేదని.. వచ్చే జూన్ నాటికీ 17 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేసారు. ఇద్దరు పిల్లలు కంటే వారి పోటీకి అనర్హులు చేసే చట్టం తెస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఇద్దరు పిల్లలు కనాలన్నారు. భవిష్యత్తు లో జనాభా తగ్గే అవకాశం ఉందన్నారు. జనాభా తగ్గితే అనేక సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించారు.

Also Read : జగన్‌కు ఆ మాత్రం తీరిక లేదా..?

అనకాపల్లి వద్ద లక్ష కోట్ల తో స్టీల్ ప్లాంట్ వస్తుందని.. 30వేల మందికి ఉపాధి వస్తుందన్నారు. బుడగడ్ల పాలెం లో చేపల ఉత్పత్తి ప్రాజెక్ట్ పైలెట్ ప్రాజెట్ క్రింద చేపడతామని తెలిపారు. వాట్సాప్ గవర్ననెన్స్ సేవల ద్వారా త్వరలో వెయ్యి సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నారాయణపురం, మడ్డువలన, తోటపల్లి కాల్వలు పూర్తి చేసే భాద్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేసారు. అణు విద్యుత్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు.. ఆర్ ఆర్ ప్యాకేజీ త్వరలో అందిస్తామని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్