Saturday, August 30, 2025 04:04 AM
Saturday, August 30, 2025 04:04 AM
roots

వరుస వివాదాల్లో టీడీపీ నేతలు..!

తెలుగుదేశం పార్టీ నేతల తీరు.. ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చామనే ధీమాతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు చేస్తున్న పనులు సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి చేరడంతో.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు తూర్పు, ఆముదాలవలస, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేల తీరు ఇటీవల పార్టీకి కావాల్సినంత చెడ్డపేరు తీసుకువచ్చింది. నిజానిజాల మాట పక్కన పెడితే.. ఈ ముగ్గురి పేరుతో సోషల్ మీడియాలో ఆడియో, వీడియోలు వైరల్‌గా మారాయి. వీటికి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండా పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమర్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : జామ ఆకు టీ.. షుగర్ ను కంట్రోల్ చేస్తుందా..?

ఇటీవల ఓ మహిళతో నసీర్ అహ్మద్ వీడియో కాల్ మాట్లాడుతూ అసభ్యంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన నసీర్ అహ్మద్.. అందులో ఉన్నది తాను కాదని.. ఏఐ వీడియో అని వివరణ ఇచ్చుకున్నారు. సదరు మహిళ కూడా తన భర్తలో మాట్లాడుతున్న వీడియోను కొందరు హ్యాక్ చేసి ఇలా మార్ఫింగ్ చేశారన్నారు. అయితే ఇందులో ఉన్నది ఎమ్మెల్యే నసీర్ అనేది వైసీపీ నేతలు ఆరోపణ.

మరో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరుతో ఉన్న ఆడియో కొత్త వివాదానికి తెర లేపింది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ గురించి అసభ్యంగా మాట్లాడారని.. సినిమా రిలీజ్ ఆపేందుకు కూడా వార్నింగ్ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై తారక్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అనంతపురంలో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి యత్నించారు. దీనిపై సదరు ఎమ్మెల్యే వివరణ వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నేను అలా అనలేదు.. నాకేం సంబంధం లేదు.. అంటూ ఎమ్మెల్యే వీడియోలో వాపోయారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

Also Read : భారత్ ఆయిల్ కొనడం లేదు.. ట్రంప్ సంచలన కామెంట్స్

కూన రవికుమార్ పై పొందూరు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ సంచలన ఆరోపణలు చేశారు. కూన రవికుమార్ పిలిచినప్పుడు వెళ్లలేదనే కారణంతోనే తనను వేధిస్తున్నారని.. అన్యాయంగా తనను బదిలీ చేశారనేది మహిళా ప్రిన్సిపాల్ సుష్మ ఆరోపణ. అర్థరాత్రి పూట కూడా తనతో వీడియో కాల్ మాట్లాడేవారని.. లైంగికంగా వేధించారని.. కానీ తాను ఒప్పుకోలేదనే కారణంతోనే ఇప్పుడు బదిలీ వేటు వేశారనేది మహిళ ప్రిన్సిపాల్ ఆరోపణ. అయితే ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో.. కూన రవికుమార్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రవికుమార్.. అమరావతిలోని పార్టీ నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం వెనకున్న అసలు కుట్రదారులను బయట పెడతానని వెల్లడించారు.

అయితే ఈ వ్యవహారం పార్టీ అధినేత దృష్టికి చేరడంతో.. చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదన చంద్రబాబు హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత.. చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. నిజంగానే తప్పుడు ఆరోపణలు చేస్తే.. అలా ఫేక్ ఆడియో, వీడియోలు రిలీజ్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్