Wednesday, February 4, 2026 11:10 AM
Wednesday, February 4, 2026 11:10 AM

సంతకం పెట్టీ వెళ్ళే ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫోకస్..!

క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ దేశంలో ఉన్న ఎన్నో రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ ఉంటుంది. ఎన్ని అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ, నాయకులు ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ… వాటి ప్రభావం ప్రజలపై పడకుండా క్రమశిక్షణ పేరుతో అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. నాయకులు కూడా కంట్రోల్ లో ఉండాలి అనేది పార్టీ అధిష్టానం ఆలోచన. కానీ చాలామంది నాయకులు మాత్రం ఈ విషయంలో పార్టీ విధివిధానాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు అనేది వినపడుతున్న మాట. అసెంబ్లీ సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఎన్ని సార్లు చెప్పినా నాయకుల్లో మార్పు రావడం లేదు.

Also Read : అమాయకుడి ముసుగులో నేరగాడు.. పిన్నెల్లి ఘటనపై సంచలన నిజాలు

చాలామంది నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు వినపడుతున్న ఆరోపణ. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు నాయకులు దూరంగా ఉండటం పై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఎథిక్స్ కమిటీ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా సంతకం పెట్టి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలను గతంలో చంద్రబాబు హెచ్చరించారు. అయినప్పటికీ సంతకం పెట్టేసి విజయవాడ లేదంటే గుంటూరులో ఎక్కువగా సమయం గడుపుతున్నారు అనేది ఆరోపణ. అందుకే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలపై చర్యలకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. మంత్రులు కూడా కొంతమంది అసెంబ్లీ సమావేశాల్లో ఉండటం లేదు అనేది చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Also Read : మిథున్ రెడ్డికి గాలం.. రంగంలోకి ఈడి

పూర్తి విచారణ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు పై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక టిడిపి ఎమ్మెల్యేలు చాలామంది చంద్రబాబు అసెంబ్లీలో ఉంటే మాత్రమే ఉంటున్నారని.. నియోజకవర్గ సమస్యల గురించి కనీసం ప్రస్తావించడం లేదని.. క్వశ్చన్ హవర్ తో పాటుగా జీరో అవర్ కూడా వినియోగించుకోవడం లేదనేది చంద్రబాబు ప్రధానంగా ఆగ్రహం చేస్తున్నటువంటి అంశం. కొత్త ఎమ్మెల్యేలు కూడా ఇదే తంతు ప్రదర్శిస్తున్నట్లు చంద్రబాబు గుర్తించారు. గ్రీవెన్స్ లో వచ్చే క్లిష్ట సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే పరిష్కారం ఉంటుంది కదా అని చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో చెప్పిన సరే.. దాని గురించి మాత్రం ఎమ్మెల్యేలు ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్