ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల పేషీల్లో జరుగుతున్న వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు నివేదిక చేరినట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పేషీల్లో ఉన్న సిబ్బంది తీరుపై సీఎం నివేదిక తెప్పించుకున్నట్లు వస్తున్న వార్తలు అటు మంత్రుల్లో కూడా కలవరానికి కారణమయ్యాయి. సాధారణంగా జనరల్ పాసులు తీసుకుని వస్తున్న ప్రజల విషయంలో సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నారని.. అలాగే పీఎస్ లు అడిషనల్ పిఎస్ల వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందని చంద్రబాబు వద్దకు నివేదిక చేరినట్లుగా తెలుస్తోంది.
Also Read : పెద్ద ప్లాన్ తోనే గోరంట్ల మాధవ్..!
ఇక ఓ ఎస్ డి ల వ్యవహారాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. తాజాగా కొల్లు రవీంద్ర ఓఎస్డి రాజబాబు తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. వివాదాస్పద అధికారిగా ఆయనకు ముందు నుంచి పేరు ఉంది. అయినా సరే మంత్రి రవీంద్ర ఆయనను పట్టు పట్టి మరి తెచ్చుకున్నారు. ఆయన వ్యవహారం ప్రభుత్వ పెద్దల వద్దకు చేరడంతో ఓ ఎస్ డి ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇక పలు శాఖలలో ఉన్న ఓఎస్డీలు సిబ్బందికి సహకరించడం లేదని ఆరోపణలు సైతం వినపడుతున్నాయి.
Also Read : కేబినెట్ మౌనం ఎందుకు..? జగన్ కు ఛాన్స్ ఇస్తున్నారులే
ప్రధానంగా జి.ఐ.డి నుంచి వచ్చిన ఓఎస్డీ ల నుంచి ఇబ్బందికర పరిణామాలు ఉంటున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకాలకు సంబంధించి ఓ ఎస్ డి లు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయినా సరే శాఖ పరంగా ఇటువంటి సహకారం సిబ్బందికి లేదనేది ప్రధాన ఆరోపణ. దీనితోపాటుగా మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ఓఎస్డీలు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. వీరితో పాటుగా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు నివేదిక వెళ్ళినట్లు సమాచారం.