Friday, September 12, 2025 11:02 PM
Friday, September 12, 2025 11:02 PM
roots

బ్రేకింగ్: మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీ కేబినేట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది మంత్రి వర్గం. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు నాలుగు రోజులు పల్లె నిద్ర చేయాలని సూచించారు చంద్రబాబు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్నామన్న మెసేజ్ పంపాలని సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లబ్దిదారులు అత్యధికంగా ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నట్టు వివరించాలని ఆదేశించారు.

Also Read : ఎస్.. రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు

చేసిన మంచి పనులకు విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని స్పష్టం చేసారు. విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పధకాలు ఇచ్చినా కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం అని మంత్రులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. అయినా కూడా పథకాలకు సంబంధించి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని మండిపడ్డారు. కేబినెట్ భేటి తర్వాత విశాఖ ఋషి కొండపై మంత్రులతో సిఎం చర్చించారు. ఋషి కొండ భవనాలను ఏం చేయాలనే దానిపై మంత్రులను అడిగారు. మొదట మంత్రులంతా ఋషి కొండను సందర్శించాలన్నారు సిఎం చంద్రబాబు. ఆ తర్వాత ఏం చేద్దాం అనే దాని పై మంత్రులు అభిప్రాయాలు చెప్పాలని తెలిపారు.

Also Read : ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఎన్టీఆర్ ఒక్కడే బెస్ట్

కేంద్ర ప్రభుత్వం అనేక స్కీములు పెట్టింది ఆ స్కీములని ఏపీలోకి తీసుకురావడంలో ఎంపీలతో పాటు మంత్రులు కూడా నిరంతరం మోనిటరింగ్ చేసుకోవాలన్నారు చంద్రబాబు. కాగా పోల‌వ‌రం – బ‌న‌క‌చ‌ర్చ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్ర‌త్యేకంగా జ‌ల‌హార‌తి కార్పోరేష‌న్ ఏర్పాటు చేయాలని కేబినేట్ తీర్మానించింది. జ‌ర్న‌లిస్ట్ ల అక్రిడేష‌న్ల కోసం కొత్త రూల్స్ కు అమోదం తెల‌ప‌నుంది క్యాబినెట్. కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌) రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. వ్యవసాయం, భద్రత, పరిశ్రమల కోసం డ్రోన్‌ల వినియోగం పెరిగేలా ఈ కొత్త సంస్థ పని చేయనుంది.

Also Read : బ్రేకింగ్: మిథున్ రెడ్డికి హైకోర్ట్ బిగ్ షాక్

కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై కూడా చర్చ జరిగింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటన కోసం ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధి పనులకు ఇదొక మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్