Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

రేవంత్ ప్రకటనతో.. చంద్రబాబుకు ఇబ్బందులు..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇప్పుడు చక్కటి వాతావరణం ఉందనే చెప్పాలి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వారు. తర్వాత జగన్ అధికారంలో ఉన్న సమయంలో కూడా చాలా విషయాల్లో కేసీఆర్ ఇబ్బందులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చినట్లుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!

సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కోపంగా ఉంది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి, మరో బాలుడి పరిస్థితి విషమం అనే అంశంపై రేవంత్ సర్కార్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. దీంతో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, అలాగే టికెట్ల రేట్లు పెంపునకు కూడా ఎలాంటి అనుమతులిచ్చేది లేదన్నారు. ఇదే అంశాన్ని తాజాగా సినీ పెద్దల సమావేశంలో కూడా తేల్చి చెప్పారు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : టార్గెట్ మహిళా ఎమ్మెల్యే.. కార్పోరేటర్లకు జగన్ ఆదేశాలు

సినీ పరిశ్రమ విషయంలో తెలుగు రాష్ట్రాల నిర్ణయాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఒక రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే రెండో రాష్ట్రం కూడా తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది హాట్ టాపిక్. సంక్రాంతికి బడా సినిమాలు మూడు రిలీజ్ అవుతున్నాయి. రామ్ ‌చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మాతగా వస్తున్న గేమ్ ఛేంజర్‌తో పాటు వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం, నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్‌లో వస్తున్న డాకూ మహరాజ్ కూడా సంక్రాంతి రేసులోనే ఉన్నాయి. వీటికి బెనిఫిట్ షోలతో పాటు ప్రత్యేక షోలు, ధరల పెంపు అంశాలపై త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ఆయా సినిమా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ సర్కార్ నో ఛాన్స్ అని చెప్పడంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది అందరిని ఆలోచించేలా చేస్తోంది. వాస్తవానికి గతంలో సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్ ఓ ధరను ఫిక్స్ చేసింది. అయితే ఆ సమయంలో సినీ పెద్దలంతా వచ్చిన వేడుకున్నప్పటికీ జగన్ దిగిరాలేదు. అప్పుడు సినీ పరిశ్రమకు చంద్రబాబు అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్నే చంద్రబాబు అమలు చేస్తారా లేదా అనేది సినీ పరిశ్రమతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న అంశం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్