సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సిఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సిఎం మమేకం అయ్యారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వయంగా వివరించారు. అనంతరం మాట్లాడిన కీలక వ్యాఖ్యలు చేసారు. మామిడి రైతులకు మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా..? అని నిలదీశారు సిఎం. శవ రాజకీయాలు చేసే వారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు.
Also Read : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన..!
సిండికేట్ సమస్య కూడా ఉంది.. దానిని సెట్ చేస్తా అంటూ హెచ్చరించారు. మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యపై సమీక్ష పెట్టానని.. రైతుల ఇబ్బందులను మేం పరిష్కరిస్తాం.. రైతులకూ మాపై నమ్మకం ఉందన్నారు చంద్రబాబు. మామిడి రైతుల గురించి.. వ్యవసాయం, హర్టీకల్చర్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా..? అని నిలదీశారు. మైక్రో సబ్సిడీలిచ్చారా..? అని ప్రశ్నించారు. హంద్రీనీవా పనులను మేమే చేపడుతున్నామన్నారు.
Also Read : తొలి అడుగులో బీటలు.. ఎందుకిలా..?
ఏడాదిలోనే రూ.3980 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇక సింగయ్య మరణంపై కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామని.. అనర్హులకు పెన్షన్ తీసేస్తే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కారు కింద కార్యకర్త పడ్డా మానవత్వం చూపించలేదని.. కుక్క పిల్ల మాదిరిగా సింగయ్యను పక్కన పడేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సింగయ్య కుటుంబసభ్యులను బెదిరించారన్నారు.