చంద్రబాబు అంటేనే టెక్నాలజీ.. చంద్రబాబు అంటేనే విజన్ అనే మాట అందరికీ తెలుసు. ఎప్పుడే 1996లో విజన్ 2020 పేరుతో చంద్రబాబు పదే పదే వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీ భోజనం పెడుతుందా.. ఐటీ ఉద్యోగాలు ఇస్తుందా.. అంటూ అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ 2020 నాటికి నిజంగానే ఐటీ వల్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. సైబరాబాద్ అనే ఓ సరికొత్త నగరమే అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం నాటి విమర్శించిన నేతలు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.
Also Read : ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. మహిళా నటి సంచలన కామెంట్స్..!
అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ విషయం అయినా సరే.. మాటల్లో కంటే చేతల్లో చేసి చూపిస్తేనే ప్రజలు నమ్మే పరిస్థితి. వాస్తవానికి 1996లో విజన్ 2020 డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెప్పినప్పుడు ప్రజలకు దాని మీద పెద్దగా అవగాహన లేదు. పత్రికల్లో చదవటం తప్ప.. అసలు చంద్రబాబు ఏం చెబుతున్నారు.. ఏం చేస్తున్నారనే విషయంపై పెద్దగా ఆలోచించలేదు కూడా. అందుకే విజన్ 2020 అనే మాటను అంతా అప్పట్లో లైట్ తీసుకున్నారు.
ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ చిన్న విషయం అయినా సరే.. ప్రతి ఒక్కరికీ ఇట్టే తెలిసిపోతోంది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా కారణంగా ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతోంది. దీనిపై ప్రతి ఒక్కరు తనదైన శైలిలో విశ్లేషణలు కూడా చేస్తున్నారు. అయినా కూడా చంద్రబాబు మాత్రం.. అదే పాత పద్ధతిలో వ్యవహరిస్తుండటం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతోంది.
Also Read : బిగ్ బాస్ లోకి మెగా ఫ్యామిలీ హీరో ఎంట్రీ
ఏపీని తిరిగి గాడిలో పెడుతున్నాం అనేది చంద్రబాబు పదే పదే చెప్తున్న మాట. ఏపీకి పెట్టుబడులు తీసుకువస్తున్నామని.. రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామనేది చంద్రబాబు మాట. అయితే వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాజధానిలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అసలు ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు అనేది సామాన్య ప్రజల మాట. ప్రతి రోజు అమరావతి కోసం ఆ సంస్థ వచ్చింది.. అమరావతిలో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతోంది.. అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి తప్ప.. అక్కడ నిజంగా వస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి. నిర్మాణాలు పూర్తైన భవనాలు కూడా ప్రారంభానికి నోచుకోకపోవడంతో.. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో తెలియటం లేదనేది ఏపీ ప్రజల అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఐకానిక్ బ్రిడ్జ్, అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్.. అంటూ మరోసారి బూస్టింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు చెప్తున్నవన్ని కేవలం కంప్యూటర్ స్క్రీన్ మీద ఉంటాయి తప్ప.. ఒక్కడి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు అనేది ప్రతిపక్షాల విమర్శలు. మరి ఇప్పటికైనా ఈ బూస్టింగ్ డైలాగులకు చెక్ పెట్టి.. వాస్తవాలు చూపిస్తారో లేదో చూడాలి.