Thursday, February 5, 2026 02:59 AM
Thursday, February 5, 2026 02:59 AM

ఫైనల్ గా అవకాశం వచ్చింది..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దాదాపు 15 ఏళ్లుగా చట్టసభకు ప్రాతినిధ్యం వహించాలనే నాగబాబు కోరిక త్వరలోనే ఫలించనుంది. ఏపీ కేబినెట్ లో ప్రస్తుతం ఒకరికి అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి ముందే పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఒక స్థానం మాత్రం ఖాళీగా ఉండటంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అదే సమయంలో నాగబాబు పేరు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఓసారి, రాజ్యసభ సభ్యుడంటూ మరోసారి పుకార్లు షికారు చేశాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే నాగబాబు పేరు ప్రచారంలో ఉంది. జనసేన పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని… అందుకోసమే అక్కడ ఇల్లు, ఆఫీస్ తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వీటిని నాగబాబు కూడా కొట్టిపారేయకుండా… పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తా అంటూ క్లారిటీ ఇచ్చారు.

Also Read: పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు 

అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. దీంతో అక్కడ నుంచి సీఎం రమేష్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో నాటి నుంచి నాగబాబు కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ పదవుల అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి నాగబాబు పేరు మాత్రం ప్రముఖంగా వినిపించింది. ఈ పుకార్లను అటు జనసేన, ఇటు టీడీపీ నేతలు ఏమాత్రం ఖండించలేదు. రకరకాల పదవులకు నాగబాబు పేరు వినిపించినప్పటికీ ఫైనల్ గా మంత్రివర్గంలో చోటు దక్కింది.

Also Read : నాపై కక్ష అందుకే… మనోజ్ సంచలనం

ప్రస్తుతం ఏ చట్టసభ నుంచి కూడా నాగబాబు ప్రాతినిధ్యం వహించటం లేదు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. వాస్తవానికి ఇలా పదవి చేపట్టిన తర్వాత చట్టసభకు ప్రాతినిధ్యం వహించటం కొత్తేం కాదు. 2014 ప్రభుత్వంలో నారా లోకేష్, నారాయణలను ముందు పదవి చేపట్టిన తర్వాతే శాసనమండలికి నామినేట్ చేశారు. ఇక చివర్లో కూడా కిడారి శ్రావణ్ కుమార్ ను ఇలాగే మంత్రిని చేశారు చంద్రబాబు. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేసిన తర్వాత శ్రవణ్ ను మంత్రిని చేశారు. అయితే ఎన్నికలకు ఆరు నెలల లోపే గడువు ఉండటంతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఎన్నికలకు నెల ముందే శ్రవణ్ కుమార్ ను పదవి నుంచి తప్పించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్