Tuesday, October 28, 2025 03:57 AM
Tuesday, October 28, 2025 03:57 AM
roots

టీడీపీ ఎమ్మెల్యే రచ్చ.. ప్రభుత్వం పరువు తీస్తున్నారా…??

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా… కొందరు నాయకుల కారణంగా ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి కొందరు నేతల నుంచి సమస్యలు ఎదురు అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన నాయకులు ఇష్టారీతిన ప్రవర్తించడం చికాకు పెడుతోంది. తాజాగా సౌమ్యుడిగా పేరున్న.. నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ కుమార్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే హల్చల్ చేసాడు.

Also Read : తెలంగాణాపై మీనాక్షి గురి.. యాక్ట్ చేస్తే తాట తీస్తాం..!

ఇప్పటికే జీవీ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా అరవింద్ బాబు వ్యవహారంతో టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. టిడిపి సాంప్రదాయానికి విరుద్ధంగా అరవింద్ బాబు వ్యవహరించడం గమనార్హం. డిపోలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు డిమాండ్ చేసి.. తానిచ్చిన జాబితాలో వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం గమనార్హం. అప్పుడే చాంబర్ నుంచి వెళ్తానంటూ సోఫాలో బైఠాయించడం సంచలనం అయింది.

Also Read : అసలు హోదా కోసమే ఎందుకు ఇంత గోల..?

మంత్రి కొల్లు, ఎమ్మెల్యే జీవీ ఫోన్లో మాట్లాడినా పట్టించుకోని ఎమ్మెల్యే.. ఎక్సైజ్ కమిషనరేట్లో చేసిన హడావుడి తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ చాంబరు వెళ్లి ఒక రకంగా ఘెరావ్ చేసారు. మద్యం డిపోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చేయాలని డిమాండ్ చేయడం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అధికారిని ఒత్తిడి చేయడం వివాదాస్పదం అయింది. నరసరావుపేటలోని ఎక్సైజ్ శాఖకు చెందిన ఐఎంఎల్ డిపోలో 11 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

Also Read : వంశీకి బెయిల్ కష్టమేనా..? కోర్టులో ఆసక్తికర సన్నివేశాలు

వారి ప్లేస్ లో తమ వారిని నియమించాలని ఎమ్మెల్యే గొడవ చేయడం గమనార్హం. ఇప్పటికే నరసరావుపేటలో వైన్ షాపులో లిక్కర్ షాపుల్లో వాటా కావాలంటూ షాపు షాప్ యజమానులకు బెదిరింపులు వెళ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు సీఎం కి నరసరావుపేట టిడిపి నేతలు ఎమ్మెల్యేపై ఫిర్యాదులు కూడా చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్