రష్యాతో భారత స్నేహాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ ను సుంకాల పేరుతో బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్ కూడా తన స్వరాన్ని పెంచింది. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కేంద్ర మంత్రి జైశంకర్.. ట్రంప్ సర్కార్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మాతో అంత ఇబ్బందిగా ఉంటే మా ఉత్పత్తులు కొనవద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు శుద్ధి చేసిన ఆయిల్ ను భారత్ నుంచి కొనడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
Also Read : చంద్రబాబు.. మళ్లీ అదే బూస్టింగ్..!
తాజాగా మరోసారి రష్యాతో ఆయిల్ డీల్ గురించి భారత్ స్పందించింది. భారత కంపెనీలు తమకు మంచి డీల్ కుదిరిన చోట నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాయని, కేంద్రం తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటుందని రష్యాకు భారత రాయబారి వినయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రష్యా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న TASS వార్తా సంస్థకు ఆదివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు ఇంధన భద్రతను కలిగించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేసారు.
Also Read : ట్రంప్ పై కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్
భారత్ డిస్కౌంట్ ధరకు రష్యన్ ముడి చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. వాణిజ్యం అనేది పూర్తిగా వాణిజ్య ప్రాతిపదికన జరుగుతుందని చెప్పిన ఆయన.. అనేక దేశాల మాదిరిగానే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటుందని అన్నారు. అమెరికా మరియు యూరప్‌తో సహా ఇతర దేశాలు రష్యాతో వ్యాపారం చేస్తున్నాయన్నారు. రెండు దేశాల వ్యాపారం అనేది పరస్పర ప్రయోజనం ఆధారంగా ఉంటుందని ఆయన తేల్చేసారు.




