కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో పలు కీలక మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ భారంగా మారిన కొన్ని ఉత్పత్తుల విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్ర సర్కార్ సిద్దమైంది. జాతీయ మీడియా వర్గాల ప్రకారం.. జీఎస్టీ స్లాబుల్లో కీలక మార్పులకు కేంద్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనితో కొన్ని ధరలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. రోజువారీ వినియోగ వస్తువుల ధరలు దీని కారణంగా తగ్గే అవకాశం ఉండవచ్చు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలపై కూడా పన్నులు తగ్గే అవకాశం ఉంది.
Also Read : ఉపరాష్ట్రపతి ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కష్టాలు
ఇక నుంచి కేవలం 18 శాతం, 5 శాతం మాత్రమే జీఎస్టీ స్లాబులు ఉంటాయి. గతంలో 12 శాతం ఉన్నవాటిని 5 శాతానికి, 28 శాతం కింద ఉన్న వాటిని 18 శాతానికి మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ ఉన్న అన్ని వస్తువులలో 90 శాతంపై పన్నును తగ్గించి, ఈ ఉత్పత్తులను 18 శాతం బ్రాకెట్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 12 శాతం పన్ను విధిస్తున్న వాటిల్లో ఎక్కువ భాగం రోజువారిగా వినియోగించే వస్తువులే ఉన్నాయి.
వాటిని 5 శాతంలోకి తీసుకొస్తే పేదలకు, మధ్యతరగతి వారికి మేలు చేకూరే అవకాశం ఉంటుంది. అదనంగా, పొగాకు ఉత్పత్తులు సహా కొన్ని వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను ఉంటుంది. ఈ జాబితాలో కేవలం 5 నుంచి 7 ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. టూత్ పేస్ట్ నుండి గొడుగులు, కుట్టు మిషన్ లు, , ప్రెషర్ కుక్కర్లు, చిన్న వాషింగ్ మెషీన్లు వంటి చిన్న గృహోపకరణాల ధరలు తగ్గే అవకాశం ఉంది. సైకిళ్ళు, రెడీమేడ్ దుస్తులు (రూ. 1,000 కంటే ఎక్కువ ధర), పాదరక్షలు (రూ. 500 మరియు రూ. 1,000 మధ్య) కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read : వైసీపీకి టీడీపీ బంపర్ ఆఫర్..!
అలాగే వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ పనిముట్లు కూడా తగ్గుతాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి నేటి డిజిటల్ ప్రపంచంలో అవసరమైన వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్కూల్ పిల్లలు వాడే జామెట్రీ బాక్స్ లు, నోట్‌బుక్‌లు వంటి స్టేషనరీ వస్తువులు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎరేటెడ్ వాటర్, అలాగే నిర్మాణ రంగంలో ఉపయోగించే రెడీ-మిక్స్ కాంక్రీట్, సిమెంట్ వంటి కొన్ని వస్తువులు 28 శాతం నుంచి 18 శాతంలోకి రానున్నాయి.