Tuesday, October 28, 2025 05:10 AM
Tuesday, October 28, 2025 05:10 AM
roots

ఐపిఎల్ కు కేంద్రం షాక్.. ఆ ప్రకటనలు అన్నీ బ్యాన్

మార్చి 22 నుండి ప్రారంభమయ్యే రాబోయే సీజన్‌లో పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను, సర్రోగేట్ ప్రమోషన్‌లను పూర్తిగా నిషేధించాలని ఆదేశిస్తూ భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరియు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు లేఖ రాసింది. ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రకటనలు వద్దని స్పష్టం చేసింది. ఏదైనా వేదికపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొగాకు, మద్యాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే ప్రకటనల విషయంలో ఆటగాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Also Read : అభిమానులను వెంటాడే భయం ఇదే..!

దీని వెనుక బలమైన కారణం ఏంటీ అంటే.. భారతదేశం గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి వివిధ నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల భారాన్ని ఎదుర్కొంటోంది. ఈ వ్యాధులు ప్రతీ ఏటా… 70% కంటే ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయి. పొగాకు, మద్యం వాడకం దీనికి ప్రధాన కారణాలు అని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు సంబంధిత మరణాలలో భారత్ రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : సినిమాల్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. స్టోరీ లైన్ కూడా చెప్పేశారు…!

దేశంలో దాదాపు 14 లక్షల వార్షిక మరణాలు సంభవిస్తుండగా వాటిల్లో 70 శాతం పొగాకు మరణాలే ఉన్నాయి. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, గుండె, మెదడు మరియు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. పొగాకు వినియోగం వల్ల ఊపిరితిత్తులు, నోరు మరియు గొంతు క్యాన్సర్ మాత్రమే కాదు, ప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు కొన్ని రక్త క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం, మద్యపానం కూడా అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అనే పరిస్థితికి కారణమవుతాయని తేలింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్