ఈ రోజుల్లో పలు సినిమాలకు సెన్సార్ బోర్డులు ఇస్తున్న సర్టిఫికేట్ లు కొంత వివాదాస్పదం అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సినిమాకు ఇలాగే వివాదాస్పదం అయింది కేరళలో. కేరళ స్టోరీస్ పార్ట్ 2 కి సంబంధించి అక్కడి హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం నాడు థియేటర్లలో రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా విడుదలపై రెండు వారాల తాత్కాలిక స్టే విధిస్తూ కేరళ హైకోర్ట్ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. కేరళ స్టోరీ 2 సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Also Read : పెద్దల సభ కు రేవంత్ స్టైల్ లాబీయింగ్
ఇక సన్‌షైన్ పిక్చర్స్‌కు చెందిన విపుల్ అమృత్ లాల్ షా సినిమాను నిర్మించారు. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాతలు చెప్పినా.. కొన్ని సీన్లపై వివాదం నడుస్తోంది. ఈ చిత్రానికి ఇచ్చిన యుఏ సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ శ్రీదేవ్ నంబూద్రి దాఖలు చేసిన పిటిషన్ ను కేరళ హైకోర్టు విచారిస్తోంది. ఆయన పిటిషన్ ప్రకారం, ది కేరళ స్టోరీ 2 కేరళ రాష్ట్రాన్ని, ప్రజలను కించపరిచేలా ఉంది. ఈ సినిమాకు అనుమతులు ఇచ్చినందుకు సెన్సార్ బోర్డుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : టార్గెట్ జనసేనాని అంటున్న బొలిశెట్టి..!
మైండ్ వాడకుండా సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చారని మండిపడింది. పిటిషనర్ ఫిర్యాదును బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వాదనలు ముగిసే వరకు సినిమాను విడుదల చేయరాదని, టీజర్, ట్రైలర్ లు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని హైకోర్ట్ అభిప్రాయపడింది. కేరళ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ది కేరళ స్టోరీ 2 నిర్మాత.. విపుల్ అమృత్ లాల్ షా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాను కేరళ హైకోర్ట్ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

