కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనం రేపిన విషయాల్లో.. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం ఒకటి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కల్తీ నెయ్యిని తిరుమల ప్రసాదంలో వినియోగించారనే ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎంటర్ కావడంతో.. సిబిఐ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దీనితో రాష్ట్ర పోలీసు అధికారులతో కలిసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.
Also Read : చెవిరెడ్డికి తుడా దెబ్బ.. అరెస్టుకు రెడీ..?
ఈ దర్యాప్తు బృందం విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తిరుమలకు సరఫరా చేసిన డైయిరీలతో పాటుగా పలువురు అధికారులను విచారించారు. తాజాగా నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని చెబుతూ సిబిఐ దర్యాప్తు బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అఫీడవిట్లో ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని పేర్కొంది.
Also Read : చంద్రబాబుపై క్యాడర్ ఫైర్.. ఇదేనా మిజరబుల్ ట్రీట్మెంట్..?
కనీసం కల్తీ చేసిన నెయ్యి కూడా కాదని రసాయనాలతో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసే బోలె బాబా డైయిరీ వాటిని వైష్ణవి అలాగే ఏఆర్ డైయిరీల పేరుతో టిటిడి కి సరఫరా చేసిందని పేర్కొంది. నెయ్యి మాఫియా.. సాక్షులను బెదిరిస్తోందని వారు వేసినట్లుగా తప్పుడు పిటీషన్లు వేస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఎవరూ సిబిఐ దర్యాప్తు బృందం ముందు హాజరు కాకుండా కాపలా కాస్తున్నారని ఒక సాక్షి తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగితే అతనిని కిడ్నాప్ చేసి చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారని.. సుప్రీంకోర్టుకు తెలిపింది. మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారని ఆ వ్యక్తి తన పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.