Saturday, September 13, 2025 06:41 PM
Saturday, September 13, 2025 06:41 PM
roots

మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ

దాదాపు మూడు నాలుగు ఏళ్ళ నుంచి మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వడం ఫ్లాప్ కావడం కామన్ గా మారిపోయింది. ఒక అల్లు అర్జున్ మినహా మిగిలిన మెగా హీరోలు ఎవరూ ఈ మధ్యకాలంలో సరైన హిట్ కొట్టలేదు. భారీ అంచనాలతో వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మరో మూడు సినిమాలు లైన్లో పెట్టారు మెగా హీరోలు. చిరంజీవి హీరోగా విశ్వంభరా సినిమా రెడీ అవుతోంది.

Also Read : రేవంత్, కేటీఆర్ కు ఉన్న ధైర్యం జగన్‌కు లేదా..?

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఓ జి అనే సినిమా ఈనెల 25న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. దీనితో పెద్ది సినిమా సూపర్ హిట్ కావాలని పూజలు కూడా మొదలుపెట్టారు. సానా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఫాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చింది.

Also Read : ఆయనకు మంత్రి పదవి ఖాయమా..!

ఇక మరో గిఫ్ట్ ఫ్యాన్స్ కోసం రెడీ చేస్తున్నారు మేకర్స్. త్వరలో రాంచరణ్ సినిమాల్లోకి అడుగుపెట్టి 18 ఏళ్ల కావస్తున్న సందర్భంగా ఒక సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి సినిమాలోని ఓ సాంగ్ రామ్ చరణ్ కోసం రీమేక్ చేశాడు డైరెక్టర్ అనే టాక్ వస్తోంది. సుకుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఈ సాంగ్ హైలెట్ గా నిలిచింది అంటున్నారు సినీ జనాలు. డాన్స్ కు ప్రయారిటీ ఉండే ఈ సాంగ్ లో.. రామ్ చరణ్, జాన్వి కపూర్ తో పాటుగా మరో.. స్టార్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ కు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ కూడా ఇచ్చినట్లు టాక్. వచ్చే ఏడాది మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్