Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

బాబుకు గ్యాప్ ఇవ్వని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలపడే ప్రయత్నం చేస్తోంది అనే మాట వాస్తవం. ఇందుకోసం అక్కడి నేతలకు గాలం వేస్తోంది అనే మాట అక్షరాలా నిజం. ఎటు వెళ్ళాలో తెలియని నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు అనేది ఎవరూ కాదనలేని సత్యం. అంత వరకు ఓకే గాని ఎవరు టీడీపీలో జాయిన్ అవుతారు అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ బలంగా ఉండటంతో కారులోనే కూర్చుని, సీటు గుచ్చుకుంటున్నా సంతోషంగా సవారీ చేసిన నేతలు ఇప్పుడు ఇక సైకిల్ బెటర్ అనుకుంటున్నారు.

అందుకే ఇప్పుడు ఏపీ సిఎం చంద్రబాబుని పదే పదే కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మాజీ ఎమ్మెల్యే కలవగా మాజీ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెనుకే ఉండి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇంకో మాజీ ఎమ్మ్మేల్యే రెండు సార్లు చంద్రబాబుని కలిసారు. మనం మనం బరంపురం అనే కబుర్లు చెప్పి మరికొందరు కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు మల్లారెడ్డి ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్.

Also read : వీరికి టీడీపీ పై ప్రేమా లేక హైడ్రా అంటే భయమా..?

అప్పుడేదో కేసీఆర్ తిట్టమంటే తిట్టినా అన్న… నాకు మనసులో ఏం పాడుబుద్ధి లేదని చెప్పమని రిక్వస్ట్ చేస్తున్నారట మాజీ మంత్రి సాబ్. ఇక జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా నాకు ఎన్టీఆర్ భవన్ దగ్గర… తెలంగాణా భవన్ కు రాలేను అని సిగ్నల్స్ ఇస్తున్నారట. అసలే అధికారం లేదు పెట్రోల్ ఖర్చులు కూడా ఎక్కువైనై. అనే సంకేతం ఇప్పటికే గులాబి బాస్ లకు పంపిండు అని టాక్. ఇలా ఈ ఇద్దరూ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే సైలెంట్ గా కరకట్ట మీదకు వచ్చిపోవడానికి సిద్దమయ్యారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్