కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా ఏ రేంజ్ లో హడావిడి చేసిందో చూశాం. పాత వీడియోలను కూడా బయటకు తీసి ఏనుగులు కూడా హైదరాబాదులో ఉన్నట్లు చూపించారు. ఇక నెమళ్లు జింకలు కూడా అక్కడ తిరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గులాబీ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని పోస్ట్ చేశారు. తీరా చూస్తే వాటిలో కొన్ని ఎడిట్ చేసిన వీడియోలు అనే విషయం చాలామందికి క్లారిటీ వచ్చింది. అసలు హైదరాబాదులో ఏనుగులు లేకపోయినా ఏనుగులు ఉన్నట్లు ఏ విధంగా చూపిస్తారు అని చాలామంది షాక్ అయ్యారు.
Also Read : కాపాడండి సార్.. ఢిల్లీ స్థాయిలో మిథున్ రెడ్డి రాయబారం
ఇక ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఫేక్ వీడియోలను వైరల్ చేసిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. కొంతమంది గులాబీ పార్టీ నాయకులు కూడా వాటిని వైరల్ చేయడంతో వాళ్లందరికీ నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు 16 మందికి పోలీసులు నోటీసులు రెడీ చేసినట్లు సమాచారం. 11 మందికి ఇప్పటికే నోటీసులు పంపగా మిగిలిన వారికి కూడా త్వరలోనే ఆ నోటీసులు అందించే అవకాశాలున్నాయి.
Also Read : ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫ్లైట్ కష్టాలు
కొంతమంది కీలక నాయకులు కూడా వాటిని వైరల్ చేయడంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొంతమందిని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై కూడా విమర్శలు చేశారు కొంతమంది గులాబీ పార్టీ కార్యకర్తలు. ముఖ్యంగా హైదరాబాదులో ఉండే కొంతమంది కీలక నాయకులు దీని వెనుక చక్రం తిప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ భవన్ లో దీనికి సంబంధించి వీడియోలను ఎడిట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.