Tuesday, October 28, 2025 05:34 AM
Tuesday, October 28, 2025 05:34 AM
roots

అమరావతిపై ద్వేషం.. వైసీపీని మించిన బీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో వైసిపి ఏ రేంజ్ లో దుష్ప్రచారం చేస్తుందో అందరికీ క్లారిటీ ఉంది. రాజధాని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు సోషల్ మీడియా వేదికగా గ్రాఫిక్స్ అంటూ హడావుడి చేస్తూ ఉంటారు వైసిపి కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు. 2014 నుంచి 2019 వరకు అమరావతిలో నిర్మాణాలు పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లకపోవడంతో వైసీపీకి మరింత బలం చేకూరింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి.

Also Read : గంటా సమస్యకు దొరికిన పరిష్కారం..!

మళ్లీ తిరిగి 2024లో టిడిపి అధికారంలోకి రావడంతో అమరావతి విషయంలో ముందడుగు పడుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా అమరావతి పనులకు మళ్లీ శ్రీకారం చుట్టారు. అయితే ఈ విషయంలో వైసిపి కంటే కూడా తెలంగాణలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎక్కువగా విషం కక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచే సామాజిక వర్గం.. కమ్మ సామాజిక వర్గంపై అక్కసు తో.. టిడిపి పై కక్షతో సోషల్ మీడియా వేదికగా గ్రాఫిక్స్ అంటూ హడావుడి చేస్తోంది.

Also Read : హరీష్ విషయంలో క్లారిటీ ఎక్కడ..? ప్రచారం నిజమేనా..?

ఇటీవల ప్రధాన శంకుస్థాపన చేసిన నాటి నుంచి.. వాట్సాప్ లో స్టేటస్లు ఫేస్బుక్ లో పోస్టులతో గులాబీ పార్టీ.. ఓ సామాజిక వర్గ కార్యకర్తలు హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఓ అడుగు ముందుకేసి.. వీడియోలు చేసి అమరావతిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి.. దేవినేని ఉమా కుమారుడు వివాహానికి వెళ్లిన సమయంలో కూడా ఇదే హడావుడి జరిగింది. జగన్ కు.. ప్రత్యక్ష పరోక్ష మద్దతు ఇస్తూ.. టిడిపిని టార్గెట్ చేస్తోంది భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా. అయితే ఇదే సమయంలో బిజెపిని విమర్శించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణలో తమకు ప్రమాదకారిగా మారిన బిజెపి విషయంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా సైలెంట్ గా ఉంటుంది. బిజెపి నేతలు ఎన్ని విమర్శలు చేసినా సరే వాళ్లు మాత్రం.. బిజెపిని చిన్న విమర్శ కూడా చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్