Tuesday, October 28, 2025 05:22 AM
Tuesday, October 28, 2025 05:22 AM
roots

కేసీఆర్ స్పీడ్.. బిజెపిలో మొదలైన టెన్షన్

తెలంగాణాలో బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతోంది. రాజకీయంగా ఏడాది నుంచి పోరాటం చేయని కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ తన వ్యూహాలకు పదును పెట్టె పనిలో పడ్డారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు ఇక లేట్ చేయవద్దని.. రంగంలోకి దిగాలని వ్యూహాలు సిద్దం చేసుకున్నట్టే కనపడుతోంది. తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో గులాబి పార్టీ అధికారంలోకి రావడం కంటే.. ఇప్పుడు పోరాటాలు చేయడం అనేది ముఖ్యం. కేటిఆర్, హరీష్ రావు ఎంత చేస్తున్నా.. రాజకీయం మాత్రం వారికి అనుకూలంగా కనపడటం లేదు.

Also Read :నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?

రేవంత్ రెడ్డిని ఎదుర్కొని నిలబడటం వారికి సాధ్యం కావడం లేదు. అందుకే కేసీఆర్ స్లోగా బయటకు వచ్చేస్తున్నారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఆయన.. పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయాలని ప్రణాలికలు సిద్దం చేసారు. మహిళా అధ్యక్షురాలిని ఎంపిక చేయడమే కాకుండా.. సీట్లు పెరిగితే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యూహంగా పెట్టుకున్నారు. మహిళలకు గులాబి పార్టీలో అన్యాయం జరుగుతోందనే ఆరోపణకు చెక్ పెట్టాలనే కేసీఆర్ సిద్దమయ్యారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఆయన పోరాటం ఎలా ఉంటుందో క్లారిటీ లేదు.

Also Read : వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో యుద్ద మేఘాలు

మాజీ మంత్రులకు ఇప్పటికే ఫోన్ లు వెళ్ళాయి. ఇవన్నీ చూస్తుంటే.. బిజెపి ఇబ్బందులు పడటం ఖాయం అనే సిగ్నల్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తాము బలపడాలని ప్రయత్నం చేస్తున్న కమలం పార్టీ నేతలకు.. కేసీఆర్ స్పీడ్ ఇప్పుడు తల నొప్పిగా మారే సంకేతాలు కనపడుతున్నాయి. కేసీఆర్ ఇలాగే దూకుడుగా ఉంటే భవిష్యత్తులో తమకు మీడియాలో ప్రాధాన్యత దక్కడం కష్టమే అనే భావనలో బిజెపి నాయకులు ఉన్నారు. మరి కేసీఆర్ పోరాటాలు గులాబీ పార్టీకి ఎంత బలం చేకూరుస్తాయో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్