Saturday, February 28, 2026 03:49 AM
Saturday, February 28, 2026 03:49 AM

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్ దిగిందా..?

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మానిష్ సిసోడియాలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిపిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో రిమాండ్ కు వెళ్లిన, మరో 23 మందికి సంబంధించి సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది. ఈ మేరకు సిబిఐ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

Also Read : తప్పు ఒకరిది.. కోర్టు చీవాట్లు మరొకరికి..!

లిక్కర్ పాలసీలో ఎటువంటి స్కాం జరగలేదని అభియోగాలన్నీ ఆధారరహితం అని కోర్టు స్పష్టం చేయడంతో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు బిజెపికి షాక్ తగిలింది అంటూ చర్చలు జరుగుతున్నాయి. కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఇన్నాళ్ళు ఆమెను టార్గెట్ గా.. చేసుకుని విమర్శలు చేసిన బిజెపి నేతలకు షాక్ తగిలినట్లు అయిందంటూ పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో కవిత సేఫ్..!

త్వరలో పార్టీ స్థాపించేందుకు సిద్ధమవుతున్న కవితకు.. ఇది రాజకీయంగా ఆమెకు కొంత కలిసే వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో రాజకీయ పార్టీలపై ఆమె అవినీతి ఆరోపణలు చేస్తే.. లిక్కర్ కేసు కారణంగా కవిత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు కవిత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళవచ్చు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంలో కవితను విమర్శించే ప్రయత్నం చేస్తున్న పలువురు భారత రాష్ట్ర సమితి నేతలకు కూడా ఒక రకంగా ఇదే షాక్ అని చెప్పాలి. కవితతో పాటుగా ఇదే కేసులో జైలుకు వెళ్లిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కూడా క్లీన్ చిట్ లభించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అన్న వాకింగ్ అంటే.....

"మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది."...

పయ్యావుల వర్సెస్ మండలి...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయం హాట్...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

నాలుగేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం...

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

పోల్స్