గత నాలుగు రోజులుగా తిరుమల విషయంలో వైసీపీ.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. భూముల కేటాయింపు విషయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలపై విష ప్రచారాన్ని ఖండిస్తున్నామని, 2008లో పీపీపీ క్రింద 30.32 ఎకరాల భూమి దేవలోక్ ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగిందని స్పష్టం చేసారు. 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్‌కు గత ప్రభుత్వం ఇచ్చింది.. ముంతాజ్ హోటల్‌కు భూమిని ఇవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని పేర్కొన్నారు.
Also Read : ట్రంప్ మరిన్ని సుంకాలు..? బుజ్జగిస్తోన్న ఆయిల్ కంపెనీలు..?
ఆ భూమిని ముంతాజ్ హోటల్‌కు ఇవ్వడానికి వీల్లేదని ఈ పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. ఆ భూమి ఏడు కొండల్లోని భాగం.. సీఎం చంద్రబాబు సూచనపై ఆ పవిత్ర స్థలాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిందని వివరణ ఇచ్చారు. ఆ భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని నిర్ణయించాం.. ముంతాజ్ హోటల్ యాజమాన్యంతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఇంకా పేపర్ వర్క్ జరుగుతోంది.. భూమి హ్యాండోవర్ చేయలేదు.. ముంతాజ్ హోటల్‌కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా..? అని నిలదీశారు.
Also Read : జగన్ తిరుమలకు రావొద్దు.. వైసీపీలో అంతర్గత తిరుగుబాటు
అది పవిత్రమైన స్థలం.. ఒక అంగుళం కూడా పోనివ్వం.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంతాజ్ హోటల్‌కు ఆ భూమిని మీరెందుకిచ్చారో ముందు మీరు సమాధానం చెప్పాలి..13 ఏళ్లుగా సీబీఐ నుంచి తప్పించుకు తిరుగుతున్న దొంగలు మీరని ఆగ్రహం వ్యక్తం చేసారు. మీకు ఈ అంశంపై సీబీఐ విచారణ కోరే అర్హత లేదు.. తప్పు చేశామని లెంపలేసుకుని ముక్కు నేలకు రాయండని సవాల్ చేసారు. ఈ పాలక మండలి వచ్చినప్పటి నుంచి నీతి నిజాయితీతో పనిచేస్తోంది.. తిరుమల పవిత్రత కాపాడే ఉద్దేశ్యంతోనే మేం పనిచేస్తున్నామన్నారు. తిరుమలపై ప్రతిరోజు బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారు.. అందరూ మీలా దొంగలు ఉండరు. ఆ 20 ఎకరాలు మీరు ఊరికే ఇవ్వలేదు.. ఏం జరిగిందో మాకు తెలుసని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అజయ్ కుమార్‌ను పాయింట్ బ్లాంక్‌లో బెదిరించి 20 ఎకరాలు వెనక్కు తీసుకున్నారని సంచలన కామెంట్స్ చేసారు.




