ఈ సంవంత్సరం నేషనల్ శాసనసభ్యులు కాన్ఫరెన్స్ అమెరికా లోని బోస్టన్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆముదాలవలస ఎమ్మెల్యే, ఇంజనీర్ కూన రవి కుమార్ బోస్టన్ కు వచ్చారు. భారతదేశం నుంచి 165 మంది ప్రజాప్రతినిధులు వచ్చిన ఈ సభకి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు నుంచి ఆముదాల వలస ఎమ్మెల్యే రవి కుమార్ ఒక్కరే విచ్చేసారు.
Also Read : బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా..?
ఈ సందర్భంగా ఆముదాలవలస ఎమ్మెల్యే రవి కుమార్ బోస్టన్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. NRI టీడీపీ బోస్టన్ మహానగరంలో 2022 మహానాడు ను దిగ్విజయంగా నిర్వహించిన ఎన్ఆర్ఐ టీడీపీ న్యూ ఇంగ్లాండ్ పసుపుదళం సభ్యులని కలుసున్నారు. ఈ సందర్భంగా ముందుగా అంకినీడు ప్రసాద్ తెలుగు తమ్ముళ్ళని ఆహ్వానించాగా, సూర్య తేలప్రోలు మాట్లాడుతూ గత ఎన్నికలల్లో లక్షల్లో దొంగ ఓట్లను ఎలా గుర్తించి, తీసివేయడంలో పార్టీకి సహకరించింది సభికులు అందరకి పూసగుచ్చినట్టు వివరించారు. శ్రీ బోళ్ల S4 మీడియా అధినేత చంద్రబాబు గారి ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, పారదర్శకంగా పనిచేస్తున్న తీరుని కొనియాడారు. వీరితో పాటుగా సభలో పలువురు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ప్రసంగిస్తూ తమ స్వీయ అనుభవాలను సభ్యులతో పంచుకున్నారు.
ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ పరిపాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో లోకేష్ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం లో ఎన్ఆర్ఐ లు ఇండస్ట్రీస్ కారిడార్ కు దోహద పడాలని పిలుపునిచ్చారు . ఆంధ్రప్రదేశ్ ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. తెలుగు తమ్ముళ్లు అందరు ఇప్పటవరకు చేసిన కృషిని మెచ్చుకొంటూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగముగా తమవంతు కృషి చేయాలి అని విజ్ఞప్తి చేశారు. చివరగా వేణు కునమనేని వచ్చిన సభ్యులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఉక్కిరి బిక్కిరి అవుతోన్న కేసీఆర్.. ఏం జరుగుతోంది..?
చక్కటి విందు తోటి ముగిసిన ఈ సమావేశానికి సంపత్ కట్ట, విజయ్ బెజవాడ,త్రిభువన్ పారుపల్లి, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కృష్ణ ప్రసాద్ సోంపల్లి, రాఘవ నన్నూరి, చంద్ర తాళ్లూరి, కళ్యాణ్ కాకి, రవి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.