వైసీపీ ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలను చూసుకుని రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ పై పోలీసులు ఫోకస్ చేసారు. అతని ఉన్మాద చర్యలను ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్ లో బెదిరించిన ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు అని పోలీసుల దృష్టికి వచ్చింది.
ఈ వ్యవహారంలో బోరుగడ్డతో పాటుగా అతని అనుచరుడు పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదు చేసారు. ఆ కేసులో ఈనెల 17న అమరావతిలో అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తున్నారు. గత అయిదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అనిల్ ఎవరిరెవరిని తిడుతూ పోస్ట్ లు పెట్టాడో వాళ్ళ అందరి నుంచి పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే బెదిరింపుల వ్యవహారాలను కూడా బయటకు తీస్తున్నారు.
Also Read : ఎగిరెగిరిపడ్డ సునీతకు ఎంత కష్టం వచ్చిందో…!
మరోవైపు అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్లో కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై అనీల్ వద్ద సమాచారం లేదని తెలుస్తోంది. తాడేపల్లి పెద్దల నుంచి అతినికి డబ్బులు వచ్చాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయా బ్యాంకుల ఖాతాలను సీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను గురువారం పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా, 29 వరకు రిమాండ్ కు పంపారు.
ఈ విచారణలో మాజీ ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తిట్టమంటేనే బూతులు తిట్టానని అనీల్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని పోలీసుల వద్ద అనీల్ చెప్పినట్టు సమాచారం. కాగా మోపిదేవి ఇటీవల టీడీపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. మరి టిడిపి అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.