నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంపై నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం… ఇటీవల ఆయనకు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. గత ఏడాది కాలంగా బాలయ్యకు మంచి టైం నడుస్తోంది. వాస్తవం చెప్పాలంటే అఖండ సినిమా తర్వాతి నుంచి బాలయ్య రూట్ మారిపోయింది. వరుస ప్రాజెక్ట్ లు హిట్ కొట్టడంతో బాలయ్య మంచి జోష్ లో ఉన్నారు. అఖండ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
Also Read : ఏపీలో నామినేటెడ్ సందడి.. వాళ్ళకే పదవులు…!
బాలకృష్ణ రీసెంట్గా ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు. అధికారికంగా మాత్రం వరల్డ్ వైడ్ గా రూ.160+ కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసినట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.
Also Read : వైసీపీలో లోఫర్లు ఎక్కువ.. జగన్ పై వసంత సంచలన కామెంట్స్
ఈ సినిమా తర్వాత బాలయ్యకు పద్మ అవార్డ్ వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్ విషయం ఉంది. చిరంజీవికి కూడా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సక్సెస్ తర్వాతనే రెండవసారి పద్మ అవార్డ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కూడా బాబీనే డైరెక్టర్ కావడం గమనార్హం. ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాతో బాలయ్యకు సూపర్ హిట్ దక్కడం.. ఈ సినిమా తర్వాత.. పద్మ అవార్డు రావడం సెన్సేషన్ అయింది. ఇలా టాలీవుడ్ బడా హీరోలు డైరెక్టర్ బాబీ సినిమా తర్వాత అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకోవడం ఇంట్రస్టింగ్ గా మారింది.