Tuesday, October 28, 2025 05:15 AM
Tuesday, October 28, 2025 05:15 AM
roots

బిజేపి వర్సెస్ ట్రంప్.. 21 మిలియన్ డాలర్లపై రచ్చ..!

భారతదేశంలో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్లు నిధులు సమకూర్చడంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపై బిజేపి రియాక్ట్ అయింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా నిధులపై ఆరోపణ చేసారు. ఈ నేపధ్యంలో దర్యాప్తు జరపాలని బిజేపి కోరింది. అయితే ఈ నిధులను ఆస్తులు కూడబెట్టుకోవడానికి వాడారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. గురువారం కూడా ట్రంప్ దీనిపై ఆరోపణలు చేసారు.

Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!

దీనిని “కిక్‌బ్యాక్ పథకం” అంటూ అభివర్ణించారు ట్రంప్. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరమైన పరిస్థితులను బలోపేతం చేయడానికి 21 మిలియన్ డాలర్లు, నేపాల్‌లో జీవవైవిధ్యానికి 19 మిలియన్ డాలర్లు కేటాయించడాన్ని కూడా ట్రంప్ తప్పుబట్టారు. మరియు భారతదేశంలో ఓటర్ల సంఖ్యకు 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇస్తారని నిలదీశారు. వాళ్ళ ఓటర్ల సంఖ్య గురించి మనం పట్టించుకోవడానికి మనకు సమస్యలు లేవా అని ట్రంప్ ప్రశ్నించారు. మనకు కూడా సొంత ఓటర్లు కావాలి కదా అని ఆయన నిలదీశారు.

Also Read : గెలవాలంటే… మళ్లీ పాత పాటే తప్పదా..?

ఆ డబ్బు భారత్ తీసుకునే సమయంలో వారి అభిప్రాయం ఎలా ఉందో తనకు తెలుసుకోవాలని ఉందన్నారు. రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఇలా పలు దేశాలకు నిధులు ఇస్తుంటే.. మనకు సమస్యలు లేనట్టా అంటూ ఆయన మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన బిజెపి నాయకుడు అమిత్ మాల్వియా.. ఈ డబ్బును భారత్ లో ఆస్తులను పెంచుకోవడానికి వాడారని మండిపడ్డారు. దీనిపై విచారణ జరగాలని, అమెరికా దీనిపై విచారణ చేయాలంటూ ఆయన డిమాండ్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్