ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. పనుల విషయంలో ఆలస్యం జరగకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుని మరి పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా… ప్రధానమంత్రి వచ్చే అవకాశం ఉండటంతో పనులను ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. ఇప్పటికే ప్రధాని కార్యాలయం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
Also Read : న్యాయమూర్తి కాదు అవినీతి మూర్తి.. సంచలనం అవుతున్న ఢిల్లీ న్యాయమూర్తి వ్యవహారం..
త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తేదీలు కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే పలు కీలక భవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటి టవర్ నిర్మాణాన్ని ఘనంగా చేపట్టాలని భావిస్తుంది. ఇందుకోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని బిల్ గేట్స్ తో కలిసి చంద్రబాబు నాయుడు నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదే విషయాన్ని బిల్ గేట్స్ వద్ద చంద్రబాబు ప్రస్తావించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : అసెంబ్లీలో పార్టీ పరువు తీసిన జగన్
రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు పలు ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇక ఇదే సమయంలో ఐటి టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు బిల్ గేట్స్ ను చంద్రబాబు ఆహ్వానించారట. మే నెలలో ఆ టవర్ కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆ టవర్ నిర్మాణ బాధ్యతలను ఒక ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ చేపట్టింది. ఇక పలు కేంద్ర ప్రభుత్వ భవనాలతో పాటుగా.. ప్రముఖ విద్యాసంస్థల భవనాలను కూడా అమరావతిలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే భూ కేటాయింపులు కూడా జరిగిపోయాయి. అటు కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు ఒప్పంద పత్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది.