ఈ సారి బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు – “చదరంగం కాదు రణరంగం” – చాలా హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సీజన్‌లో సామాన్యులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రచారం కూడా బలంగానే సాగింది. కొందరిని ఎంపిక చేసి వారికి కఠినమైన టాస్కులు ఇచ్చి, అందులోనుంచి ఎంపికైన వారిని హౌస్‌లోకి పంపించారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే కాన్సెప్ట్‌తో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావించారు. రెండు హౌస్‌లు ఉండటం కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. అయితే వాస్తవానికి రియాలిటీ మాత్రం కొంచెం భిన్నంగా ఉంది.
Also Read : జెన్ జీతో రాహుల్ పక్కా ప్లాన్.. బీజేపీ ఎదుర్కొంటుందా..?
ప్రచారం భారీ స్థాయిలో జరిగింది. ఖర్చు కూడా తగ్గకుండా చేశారు. దాంతో బిగ్ బాస్ కొత్త రికార్డులు సృష్టిస్తుందనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాలేదు. ఎందుకంటే టీవీ రియాలిటీ షోల విజయాన్ని కొలిచేది టిఆర్పి రేటింగ్స్. తాజాగా స్టార్ మా ఘనంగా ప్రసారం చేసిన లాంచింగ్ ఎపిసోడ్ కూడా రేటింగ్స్‌లో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. అర్బన్ ఏరియాలో 11.37, అర్బన్-రూరల్ కలిపి 9.7 రేటింగ్స్ మాత్రమే వచ్చాయని సమాచారం. ఇవి పెద్ద సంఖ్యలు కావు. ఇంతలోనే కార్తీకదీపం సీరియల్ దానికి మించి రేటింగ్స్ సాధిస్తోంది.
Also Read : బ్రేకింగ్: ఎన్టీఆర్ కు గాయాలు..?
కథలో కొత్తదనం లేకపోయినా, సాగదీత ఉన్నా కూడా కార్తీకదీపానికి వచ్చిన ఆదరణ, బిగ్ బాస్‌కు రాకపోవడం గమనార్హం. నాగార్జున ఉన్నా, “చదరంగం కాదు రణరంగం” అన్నా, ప్రేక్షకుల మద్దతు అంతగా లభించలేదు. నిజానికి గత సీజన్లలో కూడా బిగ్ బాస్ టిఆర్పి పరంగా పెద్ద రికార్డులు సృష్టించలేదు. అయినప్పటికీ స్టార్ మా హైప్, కార్పొరేట్ యాడ్స్, ఎండార్స్ మెంట్స్‌తో కొనసాగిస్తూ వస్తోంది. కానీ టిఆర్పి గణాంకాల్లో గణనీయమైన మార్పు కనిపించడం లేదు. లాంచింగ్ ఎపిసోడ్‌కే ఇలాంటి రేటింగ్స్ రావడం, రాబోయే ఎపిసోడ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అనుమానం కలిగిస్తోంది.